మంచి కంటెంట్‌తో నవంబర్ 7న రాబోతోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో తిరువీర్

Must Read

మంచి కంటెంట్‌తో నవంబర్ 7న రాబోతోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో తిరువీర్

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు కరుణ కుమార్

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు ఆదిత్య హాసన్

మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు యదు వంశీ

Playlist: The Great Pre Wedding Show Movie Trailer Launch Event

వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను. సిట్యువేషనల్ కామెడీతో రానున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. తిరువీర్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘తిరువీర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రోహన్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. నాకు సురేష్ బొబ్బిలి మంచి స్నేహితుడు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలి. సురేష్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని అనుకుంటున్నాను. తిరువీర్ గారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. త్వరలో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ..‘తిరువీర్ గారు చేసిన ‘పరేషాన్’ అంటే నాకు చాలా ఇష్టం. మా ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి వచ్చిన టీనా శ్రావ్యకు మళ్లీ సక్సెస్ రావాలి. రోహన్‌లో ఎంతో పాజిటివిటీ, ఎనర్జీ ఉంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త వాళ్లను సపోర్ట్ చేసేందుకు మేం ఎప్పుడూ ముందుంటాం. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

‘అంబాజీపేట’ దర్శకుడు దుశ్యంత్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఎవరైనా ఏదైనా కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తుంటే.. వారికి ఫస్ట్ ఛాయిస్‌గా తిరువీర్ నిలుస్తున్నారు. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. నవంబర్ 7న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ .. ‘తిరువీర్ కోసమే ఇంత మంది దర్శకులు ఈ రోజు ఇలా వచ్చారు. తిరు ఎప్పుడూ మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటారు. స్టార్ హీరోలు వారి స్టార్డంను బట్టి, లెక్కల్ని బట్టి కొన్ని కథలు చేయలేరు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ‘జార్జి రెడ్డి’లో తిరువీర్ యాక్టింగ్ చూసి నేను షాక్ అయ్యాను. ‘మసూద’లో అమాయకుడిగా నటించాడు. ఎలాంటి పాత్రనైనా తిరువీర్ అవలీలగా పోషిస్తాడు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

పరేషాన్ దర్శకుడు రూపక్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వీట్, సింపుల్, సెన్సిబుల్, ఫన్ రైడ్‌గా సినిమా ఉంటుంది. ఇలాంటి ఓ ఫ్రెష్ ఐడియాను సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్‌లకు కంగ్రాట్స్. నటీనటులంతా కూడా చాలా బాగా చేశారు. సోమ శేఖర్ కెమెరా వర్క్, సురేష్ బొబ్బలి మ్యూజిక్ ఇలా అన్నీ బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. తిరువీర్‌కు ఈ మూవీతో మంచి సక్సెస్ వస్తుంది’ అని అన్నారు.

జోహార్ దర్శకుడు తేజ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లే కనిపిస్తున్నారు. కొత్త నిర్మాతలకు ఈ చిత్రంతో డబ్బులు బాగానే వస్తాయి. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా సినిమా చూసి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ .. ‘‘జార్జి రెడ్డి’ టైంలోనే నాకు తిరువీర్ తెలుసు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన ప్రతీ సినిమాలో, ప్రతీ పాత్రలో సహజత్వం ఉట్టి పడుతుంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ఆయనకు మరింత సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ఇంత మంది దర్శకులు వచ్చారు. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.

చిత్ర నిర్మాత సందీప్ అగరం మాట్లాడు తూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్స్. మా హీరో తిరువీర్ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి దర్శకులంతా కూడా మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మా టీం అందరికీ థాంక్స్. నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. అందరినీ హాయిగా నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన గెస్టులందరికీ థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గారికి, సందీప్ గారికి, తిరువీర్ గారికి థాంక్స్. సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.

నటి యామిని మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఇదే నాకు తొలి చిత్రం. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు రాహుల్ గారికి, నిర్మాతలకు థాంక్స్. సోమ శేఖర్ గారి కెమెరా వర్క్ బాగుంటుంది. సురేష్ గారి మ్యూజిక్ అందరికీ నచ్చుతుంది. నాకు సపోర్ట్ చేసిన తోటి ఆర్టిస్టులు, తిరువీర్ గారికి థాంక్స్. నవంబర్ 7న మా చిత్రం రానుంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నటుడు నరేంద్ర మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

తారాగణం : తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది :
రచయిత & దర్శకుడు: రాహుల్ శ్రీనివాస్
నిర్మాతలు : సందీప్ అగరం & అశ్మితా రెడ్డి బసాని
సహ నిర్మాత : కల్పనారావు
సంగీతం : సురేష్ బొబ్బిలి
DOP : K సోమ శేఖర్
ఎడిటర్ : నరేష్ అడుప
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రజ్ఞయ్ కొణిగారి
ప్రొడక్షన్ డిజైనర్ : ఫణి తేజ మూసి
కాస్ట్యూమ్ డిజైనర్లు : ఆర్తి విన్నకోట, ప్రియాంక వీరబోయిన
సాహిత్యం : సనారే
సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్
PRO : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
పబ్లిసిటీ డిజైనర్: ఐడియల్ డాట్స్
మార్కెటింగ్: హౌస్‌ఫుల్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News