గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు నిర్మించిన చిత్రానికి శివమ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్‌రోల్‌లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో…
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..'గాడ్ ఫాదర్' లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ''నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను'' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్ ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం..ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్ ని తెరపై చూస్తారు'' అన్నారుసూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది'' అన్నారు.సత్యదేవ్ మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారి ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది (నవ్వుతూ). ఇద్దరు మెగాస్టార్లుకి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేదు. నా బెస్ట్ ఇవ్వడనికి ప్రయత్నించాను. మోహన్ రాజా గారు సినిమాని చాలా కూల్గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ 5న మీ అందరినీ అలరిస్తుంది'న్నారు.దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లుని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇస్తుంది. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి'' అని కోరారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఫన్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. F2, జాతి రత్నాలు, F3 లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఆడియన్స్…
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్…
హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. కె.కె.రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది.చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు. ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్ చేశారు. టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: కిరిటీ, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: రాధా కృష్ణ నిర్మాత: సాయి కొర్రపాటి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: కెకె సెంథిల్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్ పీఆర్వో: వంశీ-శేఖర్
పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషికడాక్టర్ గౌతమ్ నాయుడు…
గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు…
మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్…
ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి…