క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ…
దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్ టైనర్ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ 'ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది. క్రైమ్, కామెడీ చాలా ఎక్సయిటింగ్ కాంబినేషన్. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని టీజర్ ద్వారా తెలుస్తోంది. పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్
విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్…
ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలోని ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్…
సెప్టెంబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో బబ్లీ బౌన్సర్" గ్రాండ్ రిలీజ్ ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్…
నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సుధీర్ బాబుకు జోడిగా…
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” స్టన్నింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తో అందరిద్రుష్టిని ఆకర్షించింది. భారీ తారాగణం, అత్యున్నత…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, అద్భుతమైన విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేయనున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది. ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్ తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్, లో తన పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా హోంవర్క్ చేశారని, అన్ని విధాలుగా ఈ పాత్ర కోసం సిద్ధమయ్యారు అని అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్ధమౌతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో…
మిల్కీ బ్యూటీ తమన్నా బౌన్సర్స్ వీడియో జర్నలిస్ట్ లపై దాడి చేయడం సంచలనం సృష్టిస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న తమన్నా ప్రస్తుతం బబ్లీ బౌన్సర్ అనే సినిమా…