ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది.
యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ ప్రత్యేకపాటను ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేకపాటను ప్రేమ్క్ష్రిత్ నృత్యరీతులు అందించగా, పాపులర్ సింగర్ మంగ్లీ ఆలపించారు. ముఖ్యంగా ఈ పాట మాస్‌ను ఉర్రూతలూగిస్తుంది.త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…