మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకొని, అద్భుతమైన విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేయనున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది.
ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది. స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్ తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్ట్, లో తన పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా హోంవర్క్ చేశారని, అన్ని విధాలుగా ఈ పాత్ర కోసం సిద్ధమయ్యారు అని అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్ధమౌతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…