కశ్మీర్‌లో థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలోని ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్సస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చారిత్రాత్మకమన్న ఆయన.. ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా, సోపియా యువతకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్ట్వార్, రియాసీలలో ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతోపాటు ఇన్ఫోటైన్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి.

జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ ప్రజలు వినోదానికి దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, 1999లో శ్రీనగర్‌ లోని లాల్‌చౌక్‌లో ఉన్న రీగల్ థియేటర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి దిగడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలకు వినోదం అందుబాటులో లేకుండా పోయింది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

11 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

11 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago