30 రోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న YRF ‘వార్ 2’.. కొత్త పోస్టర్ రిలీజ్

Must Read

బ్లాక్‌బస్టర్ YRF స్పై యూనివర్స్ నుంచి రానున్న ‘వార్ 2’ గురించి ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామాని యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్‌గా నిర్మించిందది. ఈ ‘వార్ 2’ చిత్రం మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 14న తెరపైకి గ్రాండ్‌గా రానుంది.

‘వార్ 2’ ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా మేకర్లు తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్రల్ని చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ త్రయానికి చిత్రంలో ఉన్న ఇంపార్టెన్స్ చూపించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచేసింది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ‘వార్ 2’ ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోంది.

Latest News

తెలంగాణ నుండి 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులను ఒకే తాటిపైకి తెచ్చిన ఈశా గ్రామోత్సవం; ఎల్బీ స్టేడియంలో స్టేట్ ఫైనల్ నిర్వహణ

ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా 9,630 మంది గ్రామీణ క్రీడాకారులు...

More News