Categories: Uncategorized

ఈశా గ్రామోత్సవం 2023 గ్రాండ్ ఫినాలేలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్

ఈశా గ్రామోత్సవం, ఇది కుల అడ్డంకులను చేధించడానికి, మహిళలకు సాధికారత కల్పించడానికి అలాగే గ్రామీణ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఒక సామాజిక సాధనం: ఈశా గ్రామోత్సవం 2023 గ్రాండ్ ఫినాలేలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్

“ఈశా గ్రామోత్సవం – గ్రామస్తులు వ్యసనాలకు దూరంగా ఉండటానికి, సమాజంలోని కుల అడ్డంకులను తొలగించడానికి, మహిళలకు సాధికారత కల్పించడానికి ఇంకా గ్రామీణ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి సహాయపడే – సామాజిక పరివర్తనకు సమర్థవంతమైన సాధనంగా మారిందని తెలిసి నేను సంతోషిస్తున్నాను” అని – శనివారం కోయంబత్తూరులోని, ఈశా యోగా కేంద్రంలోని ఆదియోగి వద్ద   జరిగిన ఈశా గ్రామోత్సవం గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.

2004లో సద్గురు చే  ప్రారంభించబడిన ఈ సామాజిక కార్యక్రమం, గ్రామీణ ప్రజల జీవితాల్లోకి క్రీడాస్ఫూర్తిని ఇంకా ఉల్లాసాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ఈ మహత్తర కార్యక్రమంలో మంత్రి గారితో పాటు, ఫౌండర్-ఈశా ఫౌండేషన్  వ్యవస్థాపకులలైన  సద్గురు,  ప్రముఖ తమిళ నటుడు సంతానం మరియు మాజీ భారత హాకీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై పాల్గొన్నారు.


“సద్గురు చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమం, గ్రామీణ క్రీడలను ఇంకా  సంస్కృతిని మరెక్కడా లేని విధంగా వేడుక జరుపుకుంటోంది. ఈశా గ్రామోత్సవం – గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్య‌ం ఇంకా శ్రేయస్సు తీసుకురావాలనే లక్ష్యంతో 2004లో ప్రారంభించబడింది, ఇక ఇప్పుడు నేను ఇక్కడ క్రీడాకారులను చూస్తున్నాను, వారిలో కొందరు కూలీలుగా, వ్యవసాయదారులు అలాగే మత్స్యకారులు ఉన్నారు; కాని నేను వారిలో  క్రీడా స్పూర్తిని చూడగలుగుతున్నాను,” అని శ్రీ ఠాకూర్ అన్నారు.

112 అడుగుల ఆదియోగి వద్ద నిర్వహించబడిన ‘ఫినాలే’లో – క్రీడాకారులు కనబరిచిన గ్రామీణ ప్రతిభ పాటవం  ఆకర్షణీయంగా నిలిచింది. ప్రపంచంలోని నలుమూలల నుండి తరలివచ్చిన ప్రేక్షకులు – ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం క్రీడాకారులు తమ సర్వస్వాన్ని పెట్టి ఆడుతుండగా – ఉత్కంఠగా వీక్షిస్తూ, ఈలలు వేస్తూ వారిని ప్రోత్సాహపరిచారు. 

ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులలైన సద్గురు మాట్లాడుతూ, “వేడుక స్ఫూర్తి అనేదే జీవితానికి ఆధారం, అలాగే మీరు సరదాగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి 25,000 గ్రామాలలో, 60,000 మందికి పైగా ఆటగాళ్ళను, అలాగే ఆ గ్రామాల్లోని వందలు, వేలాది  ప్రేక్షకులు, ఏదో ఒక సమయంలో మైమరిచిపోయి – ఎగరడం, అరవడం, కేకలు వేయడం, నవ్వడం ఇంకా కంటతడి పెట్టడం వంటివి చేయడాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. జీవితం గొప్పగా జరగడానికి కావాల్సింది ఇదే” అని అన్నారు.

జీవితంలో ఉల్లాసాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ, సద్గురు ఇలా అన్నారు, “మన  మంత్రిగారు, మీరు ఏదో ఒక ఆట ఆడాలి అంటున్నారు. మీ పరిస్థితులు ఏంటో నాకు తెలీదు. మీరు అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారో లేదా ఇంకెక్కడ నివసిస్తున్నారో నాకు తెలీదు. సరే, కనీసం ఒకరిపై ఒకరు బంతి విసరవచ్చు. ఒకవేళ బంతి లేకపోతే, ఉల్లిపాయ విసరండి. ఉల్లిపాయ చాలా ఖరీదైనది అయితే, బంగాళాదుంప  విసరండి – జీవితాన్ని ఉల్లాసభరితంగా మార్చుకోవడానికి ఏదోటి విసరండి”

ఫైనల్స్‌లో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనందపురం త్రోబాల్ జట్టు కెప్టెన్, కుమారి మాట్లాడుతూ, “మొదట్లో, మేము ఆడటానికి మా కుటుంబాలు ప్రోత్సహించలేదు, కానీ మేము ఫైనల్స్‌కు చేరుకోవడం అనేది వారి దృక్పథాన్ని మార్చేసింది, ఆ తర్వాత వారే మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రోత్సహించారు. మా జట్టు సభ్యులు, సాధారణంగా  రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటారు, కాబట్టి రోజూ రాత్రి పూట ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఒక ఆమె అయితే, ఫైనల్స్‌లో పాల్గొనేందుకు తన మూడు నెలల పాపను కూడా విడిచి పెట్టి వచ్చింది! ఇక్కడికి రావడంతో మా కల సాకారమైంది.  శిక్షణ నుండి మొదలుకొని కోయంబత్తూరుకు ప్రయాణించే వరకూ – మాకు అండగా నిలిచిన ఈశా వాలంటీర్లకు ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ”అని పంచుకున్నారు.

అయితే, ఈశాగ్రామోత్సవం ఫైనల్ మ్యాచ్‌లు – వాటి పేరుకి తగ్గట్టుగా  – ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా చేశాయి. వాలీబాల్‌లో, సేలంకు చెందిన  ఉత్తమసోల్‌పురం FEC  సితురాజపురంపై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. త్రోబాల్‌లో, కోయంబత్తూరుకు చెందిన పీజీ పుడూర్‌  విజేత ట్రోఫీని గెలుచుకోగా, కర్ణాటకలోని మరగోడుకు చెందిన బ్లాక్ పాంథర్ రెండో స్థానంలో నిలిచింది. మహిళల కబడ్డీలో, అబ్బురపరిచే  రైడ్స్ ఇంకా డిఫెన్స్‌లు జరుగగా, ఈరోడ్ జట్టు దిండిగల్ జట్టును ఓడించింది. పారాలింపిక్స్ ఆటల్లో, కోయంబత్తూర్‌కు చెందిన కోయంబత్తూర్ పారా వాలీబాల్ అసోసియేషన్, కన్యాకుమారికి చెందిన కుమారి కింగ్స్‌పై  గెలిచి పారాలింపిక్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ క్రీడా మహోత్సవం, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఆవిష్కృతమైంది. దాదాపు 194 గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఈ ఆటలతో – ఈశా గ్రామోత్సవం 60,000 మంది క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది. అందులో  10,000 మంది గ్రామీణ మహిళలు ఉండగా, వీరిలో చాలా వరకూ గృహిణులు. వీరు  కబడ్డీ, త్రోబాల్ వంటి ఈవెంట్‌లలో పాల్గొన్నారు.

 ఒక ప్రత్యేక నిర్మాణం గల ఈ  ఈశా గ్రామోత్సవం, ప్రొఫెషనల్ ఆటగాళ్ళ కోసం కాదు. ఇది సామాన్య గ్రామీణ ప్రజలకు – అంటే రోజువారీ వేతనంకై పనులు చేసుకునే వారి నుండి, మత్స్యకారుల నుండి, గృహిణుల నుండి ఇతరుల వరకూ –  తమ  రోజువారీ పనుల నుండి కొంచెం విరామం పొంది,  క్రీడలలోని ఐక్యం చేసే  శక్తిని ఇంకా వేడుకనీ ఆస్వాదించేందుకు ఒక వేదికను అందిస్తుంది.

ఈశా గ్రామోత్సవాన్ని  నిర్వహిస్తున్న ఈశా ఔట్రీచ్, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖచే నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (NSPO)గా గుర్తింపు పొందింది. సచిన్ టెండూల్కర్, ఒలింపిక్ పతక విజేత రాజవర్ధన్ సింగ్ రాథోడ్, కర్ణం మల్లేశ్వరి వంటి క్రీడా ప్రముఖులు గతంలో క్రీడా ఉత్సవాల ఫైనల్స్‌లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మిథాలీ రాజ్, పివి సింధు, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్ మరియు జవగళ్ శ్రీనాథ్ ఈశా గ్రామోత్సవానికి తమ మద్దతు తెలిపారు.

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

19 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago