‘చంద్రముఖి 2’ నుంచి ‘తొరి బొరి’ సాంగ్ విడుదల

Must Read

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’ నుంచి ‘తొరి బొరి’ సాంగ్ విడుదల

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు. వడివేలు తనదైన కామెడీతో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నట్టుగా అర్థమైంది.

Chandramukhi 2 (Telugu) - Thori Bori Lyric | Raghava Lawrence, Kangana Ranaut | M.M.Keeravaani

తాజాగా చిత్రం నుంచి ఓ అందమైన పాటను రిలీజ్ చేశారు. తొరి బొరి అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను భువనచంద్ర రాయగా.. అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఇక ఎం ఎం కీరవాణి వినసొంపైన బాణీ అందరినీ మెప్పిస్తోంది. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు.

న‌టీన‌టులు:

రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: పి.వాసు, బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: తోట త‌ర‌ణి, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్‌: క‌మల్ క‌న్న‌న్‌, ర‌వివ‌ర్మ‌, స్టంట్ శివ‌, ఓం ప్ర‌కాష్‌, లిరిక్స్‌: యుగ భార‌తి, మ‌ద‌న్ క‌ర్కి, వివేక్, చైత‌న్య‌ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, దొర‌తి, మేక‌ప్‌: శ‌బ‌రి గిరి, స్టిల్స్‌: జ‌య‌రామ‌న్‌, ఎఫెక్ట్స్‌: సేతు, ఆడియోగ్ర‌ఫీ: ఉద‌య్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, ప‌బ్లిసిటీ డిజైన్‌: ముత్తు, పాయింట‌ర్ స్టూడియో, పి.ఆర్‌.ఒ: యువ‌రాజ్(త‌మిళ్‌), సురేంద్ర నాయుడు – ఫ‌ణి కందుకూరి (తెలుగు).

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News