ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా‘ఒక్కడే నెం.1 పాట విడుదల.

Must Read

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా లోని ఓ పవర్ ఫుల్ పోలీస్ పాటను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ”ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు. అలాగే వెంకన్నగారు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ కారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా., వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేయడం అభినందనీయం. ఇప్పుడు ప్రదర్శించిన పాటకూడా చాలా బాగుంది. సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. “అని అన్నారు

.

చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ…
ముందుగా మా కోరికను మన్నించి మా పాటను ఆవిష్కరించిన ప్రసన్న కుమార్ గారికి , రామసత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్‌, ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ వయస్సులో నేను హీరోగా చేయడం ఏంటి అనుకోలేదు. మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్‌ చేశారు . ఈ సినిమాను హిందీ, కన్నడ, తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
వెంకన్నగారిలో ఇంత ప్యాషన్‌ ఉందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా మంచి నటుడు అవుతారు. చిన్న బడ్జెట్‌తో పెద్ద సినిమా తీశారు. ఆయన నాతో అన్నట్టు సక్సెస్‌ అవుతున్న 5 శాతం మందిలో ఈయన కూడా ఉంటారు. పాటలు, సంగీతం, కొరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి`యన్‌.టి.ఆర్‌, సంగీతం: రామ్‌ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్‌ వేలూరు, లిరిక్స్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: రాజ్‌కుమార్‌, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్నై), వి.ఎఫ్‌.ఎక్స్‌: చందు ఆది Ê టీమ్‌, పి.ఆర్‌.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News