హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచర్ల. ఇప్పుడు మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలతో సినిమాలు చేయటంపై తన దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజస్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’తో ఆడియెన్స్‌ను అలరించబోతున్నారు. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్.
గురువారం మేకర్స్ ‘ఉరుకు పటేల’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే తేజస్ కంచర్ల పరిగెడుతుంటే అతని వెనుక కత్తిని ఎవరో విసిరేసినట్లు కనిపిస్తుంది. మరో వైపు మంగళసూత్రం, పోస్టల్ బ్యాలెట్ పేపర్, పాల క్యాన్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాల ప్రధానంగా సాగే చిత్రమని తెలుస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంపొందించేలా ఉంది.
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…