ఏడు చేపల కథ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి సమర్పించు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా యశ్వంత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జస్ట్ ఎ మినిట్. ఈ సినిమాకి సంబంధించి సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన ఘాజి, అంతరిక్షం మూవీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి.
ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ : సుధర్మ మూవీ మేకర్స్ లోగో, జస్ట్ మినిట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ ధర్మపురి తో నాకు మంచి అనుబంధం ఉంది. టెక్నికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. జస్ట్ ఎ మినిట్ సినిమాతో ప్రొడక్షన్ వైపు వచ్చారు. అదేవిధంగా అభిషేక్ రెడ్డి గతంలో చేసిన ఏడు చేపల కథ సినిమా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. నాకు తెలిసి ఉన్న ఇద్దరు జస్ట్ ఎ మినిట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి విషయం. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోంది. మంచి కామెడీ ఆరోగ్యానికి మంచిది. ఈ సినిమా కార్తీక్ కి అభిషేక్ రెడ్డికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాతలు తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉండి కూడా మా కోసం సమయం కేటాయించి మా సుధర్మ మూవీ మేకర్స్ బ్యానర్ లోగో మరియు మా జస్ట్ ఎ మినిట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సంకల్ప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నాం. ప్రేక్షకులు సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
అభిషేక్ పచ్చిపాల, ఇషిత సింగ్, వినీషా, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి
టెక్నీషియన్స్ :
నిర్మాణం : రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్
నిర్మాతలు : రెడ్ స్పైన్ ఎంటర్టైన్మెంట్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి
అసోసియేట్ డైరెక్టర్ : కార్తీక్ ధర్మపురి
ఎడిటర్ : దుర్గ నరసింహ
సినిమాటోగ్రాఫర్ : అమీర్
మ్యూజిక్ : ఎస్. కే. బాజీ
మ్యూజిక్ లేబుల్ : మధుర ఆడియో
పి ఆర్ ఓ : మధు VR
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…