తేజ‌స్ కంచ‌ర్ల ‘ఉరుకు పటేల’ ఫస్ట్ లుక్ విడుదల

Must Read

హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టంపై త‌న దృష్టిని సారిస్తున్నారు. అందులో భాగంగా తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌.

గురువారం మేక‌ర్స్ ‘ఉరుకు పటేల’ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే తేజ‌స్ కంచ‌ర్ల ప‌రిగెడుతుంటే అత‌ని వెనుక క‌త్తిని ఎవ‌రో విసిరేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రో వైపు మంగ‌ళ‌సూత్రం, పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్‌, పాల క్యాన్ అన్నీ క‌నిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేప‌థ్యంలో భావోద్వేగాల ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంపొందించేలా ఉంది.

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News