Categories: Uncategorized

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్


తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో, సావిత్రమ్మ నిర్మాణంలో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి. సాంబశివరావు మరియు వేణు గోపాల చారి సారధ్యం లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాతలు, నటుల సమక్షంలో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్ర టీజర్, ట్రైలర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ప్ర‌సాద్ ల్యాబ్‌లోజ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి డైలాగ్‌లో వచ్చిన ‘సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో, అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెర‌కెక్కించిన దర్శకుడు రమేష్ గారు భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, “ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేష్ గారు నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, “గత పదేళ్లుగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. అలాంటి వారిలో రమేష్ గారు కూడా ఒకరు. మంచి కథతో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, “ఇలాంటి మంచి ప్రయత్నాలు తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. నిర్మాత ఇంకా ఎన్నో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, “కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, “‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేమకథకు వినోదం, భావోద్వేగాలు జోడించినట్లు కనిపిస్తోంది. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు. సినిమా మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు, దర్శకుడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు-నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, “‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.

హీరో మోహన్ సిద్ధి మాట్లాడుతూ, “మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన దర్శక దిగ్గజాలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సొంత ఊరిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారి జీవితాలకు ఈ కథ మరింత దగ్గరగా ఉంటుంది. మా ఇద్దరు హీరోయిన్లు ఇద్దరూ ఎంతో బాగా నటించారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీకగా ముద్దపప్పు-ఆవకాయ లాంటి వారు అయితే, మరొకరు తెలంగాణకు ప్రతీకగా బిర్యానీ లాంటి వారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు భావోద్వేగాలను అందించే సినిమా ఇది” అన్నారు.

హీరోయిన్ మహన్ మాట్లాడుతూ, “మా కార్యక్రమానికి సినీ దిగ్గజాలు రావడం నిజంగా మా అదృష్టం. వారి ఆశీస్సులు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు.

మరో హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. మంచి కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

దర్శకుడు రమేష్ చెరుకూరు మాట్లాడుతూ, “సినిమా మీద ఫ్యాష‌న్‌తో ఈ రంగంలోకి వ‌చ్చాను. ఐదేళ్ల కోరిక నెర‌వేరిన క్ష‌ణం ఇది. మా ఈ ప్రాజెక్టు ప్రయాణంలో వి.ఎన్. ఆదిత్య గారి సహకారం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం. టీజర్, ట్రైలర్‌కు వస్తున్న స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ ప్రేమకథలో వినోదంతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుందని హీరో తెలిపారు. హీరోయిన్లు తమ పాత్రలపై సంతోషం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీష, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్‌కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.

సాంకేతిక నిపుణులు:

కథ, దర్శకత్వం: రమేష్ చెరుకూరు
నిర్మాత: సావిత్రమ్మ. సి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. సాంబశివరావు, వేణు గోపాల చారి
ఛాయాగ్రహణం (DOP): దోసడ యాదగిరి
సంగీతం: ఆదిత్య
సాహిత్యం: మధు, స్వామి
మాటలు: మెండెం శ్రీధర్
ఎడిటర్: లక్కీ
డిజిటల్: మమత రెడ్డి కాసం
పీఆర్వో: అశోక్ దయ్యాల

TFJA

Recent Posts

‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న రిలీజ్

సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…

2 hours ago

అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…

9 hours ago

“టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026” జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ

"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…

9 hours ago

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…

2 days ago

‘సింగ్ గీతం’ నేను నిర్మించి ఉంటే బాగుండేదనిపించే చిత్రం : గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…

2 days ago

సోను సూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో అంబులెన్స్ ప్రారంభం

సోను సూద్, మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో అంబులెన్స్ ప్రారంభం, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఆటోలను అందించారు…

3 days ago