హైదరాబాద్ పార్క్ హయత్… సితార ఘట్టమనేని తన అమ్మ నమ్రత ఘట్టమనేనితో కలిసి PMJ జ్యువెల్స్ సితార సిగ్నేచర్ కలక్షన్స్ మరియు లుక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తాను ఓ వాణిజ్య ప్రకటనలో నటించినందుకు తన తొలి పారితోషకాన్ని చారిటీ కోసం వెచ్చించానని సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కుమార్తె సితార ఘట్టమనేని అన్నారు. ఆమె నటించిన PMJ జ్యువెల్స్ షార్ట్ స్వీట్ ఫీచర్ ఫిల్మ్ “ప్రిన్సెస్” ప్రివ్యూతో పాటు, ఆమె తన తల్లి నమ్రత ఘట్టమనేనితో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో లుక్ బుక్ SITARA కలెక్షన్‌ను కూడా ప్రారంభించింది. దేశంలో తన పేరు మీద సిగ్నెఛర్ కలక్షన్స్ స్టార్ సితార.
ఈ సందర్భంగా సితార మీడియాతో ముచ్చటించారు. తనకు సినిమాలంటే ఇష్టమని, సినిమాల్లో నటించడమంటే చాలా ఆసక్తి అని చెప్పింది. తన తల్లి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసం నేర్చుకున్నానని చెప్పింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో PMJ జ్యువెల్స్ ద్వారా SITARA సిగ్నెఛర్ కలక్షన్స్ ప్రారంభించడం పట్ల తన తండ్రి మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. మరియు అతను యాడ్ వీడియో చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు.
నమ్రత కూడా తమ కొడుకు గౌతమ్ సినిమాల్లోకి రావచ్చని, అయితే ప్రస్తుతం అతని చదువుపై ఆసక్తి ఉందని చెప్పారు. శౌర్య పరువు దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని PMJ జ్యువెల్స్ అధికారికంగా జూలై 19, 2023న విడుదల చేయనుంది. PMJ జ్యువెల్స్ ప్రిన్సిపల్ డిజైనర్ డైరెక్టర్ దినేష్ జైన్, డైరెక్టర్ రక్షిత జైన్, నిమేష్, కిరణ్, సీమ, శిల్ప తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. .