ఆర్.కె.గాంధి దర్శకత్వంలో మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథాచిత్రం “రుద్రాక్షపురం”. “మెకానిక్” ఫేమ్ మణిసాయితేజ- వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాగ మహేష్ కీలక పాత్ర పోషించగా… ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ సురేష్ కొండేటి, బి.వీరబాబు, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.
తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నటి – ఎన్నారై ప్రశాంతి హారతి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ బాపిరాజు, గణేష్ భేరి, బోగాల సుధాకర్, మెకానిక్ దర్శకుడు ముని సహేకర్, ప్రముఖ దర్శకుడు శ్రీరాజ్ బల్లా ముఖ్య అతిథులుగా హాజరై “రుద్రాక్షపురం” ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. “రుద్రాక్షపురం” చిత్రంతో హీరోగా మణిసాయితేజ మరిన్ని మెట్లు ఎక్కాలని అభిలషించారు.
రేఖా, రాజేశ్, అజయ్ రాహుల్, పవన్ వర్మ , శోభరాజ్, శ్రీవాణి, వెంకటేశ్వర్లు, అక్షర నీహా, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం ఆర్ కె గాంధీ, సంగీతం: ఎం.ఎల్. రాజా – ఘంటాడి కృష్ణ – జయసూర్య బొంపెం, స్టంట్స్: థ్రిల్లర్ మంజు- బాజి- స్టార్ మల్లి, కెమెరా: నాగేంద్ర కుమార్ ఎం, ఎడిటర్: డి.మల్లి, నృత్యం: కపిల్ అన్నారాజ్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ!
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…