వీక్షణం వీక్షించిన రమణ గోగుల …. తక్షణమే టీం పై జల్లెను అభినందనలు

Must Read

ఆయన పాటల్లో మ్యూజిక్‌తో పాటు మ్యాజిక్ కూడా ఉంటుంది. ఆయన గొంతులో మాధుర్యంతో పాటు ఏదో తెలియని ఒక మాయ కూడా ఉంటుంది. సంగీత సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాజుగా ఏలీ తనదైన ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు రమణ గోగుల. ఆయన, మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన వీక్షణం మూవీ ప్రీమియర్ షో చూడడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

ఇప్పుడే వీక్షణం మూవీ చూసా. సినిమా చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా మ్యూజిక్ విషయానికి వస్తే, మూడు పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. హీరో కార్తీక్‌కి మంచి భవిష్యత్ ఉంది. హీరోయిన్, మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. ఫైనల్‌గా, వీక్షణం ఒక మంచి సినిమా. చిన్న సినిమా అయినా చాలా కొత్తగా ఉంది. చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. అందరూ థియేటర్‌కి వెళ్లి తప్పకుండా చూడండి. అలాగే వీక్షణం టీం అందరికీ నా అభినందనలు.” అని చెప్పారు.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News