Uncategorized

‘మహావీరుడు’కు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్

శివకార్తికేయన్ కథానాయకుడిగా మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన హిలేరియస్ పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మహావీరుడు ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. విడుదల తేదీ సమీపిస్తున్నందున మేకర్స్ మరింత జోరుని పెంచారు.  

ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. శివకార్తికేయన్ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అతను ఏదో ఒక ప్రత్యేక శక్తి నుండి గైడెన్స్ కోరుతున్నట్లుగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు ఓ పవర్ లో “ధైర్యమే జయం” అంటూ రవితేజ వాయిస్ వినిపించడం ఆసక్తికరంగా వుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

”రవితేజ సార్ మా సినిమాలో మీ ఎనర్జిటిక్ వాయిస్ అందించడం చాలా ఆనందంగా ఉంది. మహావీరుడు టీమ్‌కి మీరు అందించిన సపోర్ట్‌కి చాలా కృతజ్ఞతలు సార్. జూలై 14 నుండి  మహావీరుడు. ధైర్యమే జయం” అని శివకార్తికేయన్ ట్వీట్ చేశారు.

ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. ఈ చిత్రంలో యోగి బాబు, సరిత వంటి స్టార్ తారాగణం కూడా ఉంది.

ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

తారాగణం: శివకార్తికేయన్, యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – అరుణ్ వజ్రమోను, కుమార్ గంగప్పన్

Tfja Team

Recent Posts

ఇద్దరమ్మాయిలతో లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గమ్మత్తుగా ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌

సూపర్‌ ఇంట్రెస్టింగ్‌ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్‌ ఓటిపి టీమ్‌. ఒకరికి తెలియకుండా…

2 days ago

న‌వంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్ లాల్ ‘వృష‌భ‌’

మలయాళ సూపర్‌స్టార్‌..కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని…

4 days ago

‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చిన యుద్ధం చేయాల్సిందే’ … ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్…

2 weeks ago

శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో కలిసి ఉత్తరాంధ్రలో OGని విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా OG (‘ఓజీ’). DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ…

3 weeks ago

నవరాత్రి ఆరంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల

నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని…

3 weeks ago