Categories: Uncategorized

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ చేతుల మీదుగా ‘Mr ఇడియ‌ట్‌’ టైటిల్ పోస్ట‌ర్‌..

గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న‌ ర‌వితేజ త‌మ్ముడి కొడుకు మాధ‌వ్‌

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రానికి ‘Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌, ప్రీ లుక్‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ ఆవిష్క‌రించారు. నా కెరీర్‌లో ‘ఇడియ‌ట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మా ర‌ఘు కొడుకు మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నాలాగే త‌న‌కు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అని టీమ్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు ర‌వితేజ‌.

చిత్ర నిర్మాత నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ ‘‘మాస్ మహారాజా రవితేజగారి చేతుల మీదుగా మా ‘Mr ఇడియ‌ట్‌’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌, ప్రీ లుక్ లాంచ్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. ర‌వితేజ‌గారు ఇడియ‌ట్‌గా మెప్పించారు. ఇప్పుడు వాళ్ల‌బ్బాయి మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’గా రాబోత‌న్నారు. టైటిల్ చూడ‌గానే ఆయ‌న హ్యాపీగా ఫీల‌య్యారు. ఈ నెలాఖ‌రు నాటికి షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. డైరెక్ట‌ర్ గౌరి స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్‌, న‌టీన‌టుల సపోర్ట్‌తో సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేస్తున్నాం. సినిమా చ‌క్క‌గా వ‌స్తుంది. న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ‌గారికి, నా వెనుకే ఉండి నన్ను ప్రోత్స‌హిస్తున్న చ‌ద‌ల‌వాడ శ్రీనివాస్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.

డైరెక్ట‌ర్ గౌరి రోణంకి మాట్లాడుతూ ‘‘జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌వితేజ‌గారి బ్ర‌ద‌ర్ ర‌ఘు కొడుకు మాధ‌వ్ హీరోగా న‌టిస్తోన్న సినిమాకు Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ఖ‌రారు చేశాం. దానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాం. మ‌రో ప్ర‌య‌త్నంతో మీ ముంద‌కు వ‌స్తున్నాను. మీ అంద‌రి ఆశీర్వాదాలు అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

న‌టీన‌టులు:

మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌

సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : రామ్
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ : విప్లవ్
పిఆర్వో : GSK మీడియా
నిర్మాత : జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం : గౌరి రోణంకి

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

21 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

21 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

21 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago