మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రుహాణి శర్మ HER ట్రైలర్ రిలీజ్

చిలసౌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహాణి శర్మ (Ruhani Sharma).. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త జానర్‌లో HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ HER చాప్టర్ 1 ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వరుణ్ తేజ్.

నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేలా ఉంది. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను కట్ చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ ఈ ట్రైలర్ వదిలారు. ఇందులో రుహాణి శర్మ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. మిగిలిన తారాగణం కూడా వారి వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియోలోని ఆసక్తికర డైలాగ్స్ సినిమా రేంజ్ తెలిపేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని పెంచుతూ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

గతంలో విడుదల చేసిన HER మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకాదరణ పొందగా.. ఇప్పుడు వదిలిన ట్రైలర్ అంచనాలు నెలకొల్పింది. తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది రుహాణి శర్మ. కెరీర్ లో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్న ఆమె క్యారెక్టర్ సినిమాలో హైలైట్ అవుతుందని టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.

డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. HER ఫైనల్ కాపీ చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. జూలై 21న సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

ఇక ట్రైలర్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వర్చువల్ గా లాంచ్ చేయగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
HER ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడో అని ఇప్పట్నుంచే ఆలోచిస్తున్నాను. ఈ మధ్య వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కూడా ఒక కేసుని తీసుకొని దాన్ని చాలా బాగా సాల్వ్ చేశారు. అందులోనూ ఫిమేల్ లీడ్ తో చేయడం నాకు అది బాగా నచ్చింది. రుహాణి ఇలాంటి ఫిమేల్ లీడ్ సినిమా ఎలా చేస్తుంది అనుకున్నాను. కానీ సినిమా చూశాక తనే సినిమా అంతా మోసింది. నటులంతా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు చాలా బాగా తీశాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. నిర్మాతలకు బాగా డబ్బులు వస్తాయి. ఇటీవల ఫస్ట్ సినిమా తీసే డైరెక్టర్స్ అంతా హిట్స్ కొడుతున్నారు. శ్రీధర్ కూడా హిట్ కొడతాడు ఈ సినిమాతో, ఈ టీం అందరికి అల్ ది బెస్ట్ అంటూ టీం అందరికి సపోర్ట్ చేశారు.

హీరోయిన్ రుహాణి శర్మ మాట్లాడుతూ.. నాకు ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉండేది. ఈ సినిమా వచ్చి నన్ను ఆశ్చర్యపరిచింది. సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ నేను చేయగలనా అని ఒక డౌట్ ఉంది కానీ డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాను. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు చేశాను అని అనుకుంటున్నాను. టీం అంతా కొత్తవాళ్లు, చాలా హార్డ్ వర్క్ చేశారు సినిమా కోసం. నిర్మాతలు చాలా బాగా చూసుకున్నారు, సినిమాకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్లకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. జులై 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసిన రాజ్ కందుకూరి గారికి, ఆన్లైన్ లో ట్రైలర్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్ గారికి చాలా థ్యాంక్స్ అని తెలిపారు.

డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో ట్రైలర్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. జనాలు థియేటర్ కి వచ్చి చూడాలంటే ఏదో ఒక కొత్త విషయం ఉండాలి. 2 గంటల లోపు ఉన్న ఈ సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు మిమ్మల్ని అలరిస్తుంది. థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి అని తెలిపారు.

నటుడు జీవన్ మాట్లాడుతూ.. ఈ సినిమా సస్పెన్స్ స్టోరీ. డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం ఇది. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం. ఈ సినిమా అందరూ చూసి ఎంకరేజ్ చేయాలి. జులై 21న థియేటర్ కి వచ్చి చూడండి అని అన్నారు.

నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కి అమెరికాలో ఇళ్ళు, కారు, జాబ్ అన్ని ఉన్నా సినిమా కోసం అని వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ రుహాణి కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గొప్ప విషయం. త్వరలో సినిమాని మరింత ప్రమోట్ చేస్తాం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్, నిర్మాతలకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.

ఎడిటర్ చాణక్య మాట్లాడుతూ.. సినిమాకి ఫస్ట్ ఆడియన్ ఎడిటర్. నేను ఈ సినిమాను చూశాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. థియేటర్లో చూశాక మీకు కూడా నచ్చుతుంది అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ విష్ణు మాట్లాడుతూ.. ఇది మంచి సినిమా అవుతుంది. ఇప్పటికే టీజర్ కి మంచి రీచ్ వచ్చింది. సినిమాకి కూడా చాలా రీచ్ వస్తుంది. నన్ను సినిమాటోగ్రాఫర్ గా సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…

9 hours ago

జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల…

9 hours ago

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

2 days ago

*వెర్స‌టైల్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…

2 days ago

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’తో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.…

2 days ago

ప్రముఖ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న ‘మా’ అసోసియేషన్ మరియు కరాటే కళ్యాణి

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…

3 days ago