కౌంట్ డౌన్ షురూ.. కింగ్ ఖాన్ షారూక్ ‘జవాన్’ ప్రివ్యూ

కౌంట్ డౌన్ షురూ.. కింగ్ ఖాన్ షారూక్ ‘జవాన్’ ప్రివ్యూ .. జూలై 10, ఉద‌యం 10.30 నిమిషాల‌కు ఫిక్స్

ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘జవాన్’. ప్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ‘జవాన్’ ప్రివ్యూకి డేట్, టైమ్ ఖరారైంది. జూలై 10, ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్న‌ట్లు కింగ్ ఖాన్ షారూక్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

‘జవాన్’ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ ఎలా ఉండ‌బోతుందా? అస‌లు షారూక్ ఖాన్ స్టార్ డ‌మ్‌ను అట్లీ ఎలా చూపించ‌బోతున్నారు? అస‌లు సినిమా అన్నీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటుందా? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. సినీ ప్రేక్ష‌కులు, మీడియా వ‌ర్గాలన్నీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో ప్రివ్యూ డేట్‌, టైమ్ ప్ర‌క‌టించారు. దీంతో  సినిమాపై  జాతీయ స్థాయిలో సోష‌ల్ మీడియా స‌హా ఇత‌రత్రా వాటిలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

 క్యాలెండ‌ర్‌లో జ‌వాన్ ప్రివ్యూ డేట్‌ను మార్క్ చేసుకోండి. మాతో పాటు కౌండ‌ట్ డౌన్‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు షారూక్ ఖాన్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని విధంగా చూడ‌బోతున్నారు. ఈ సినిమాటిక్ జ‌ర్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన అనుభూతిని అందిచ‌నుందన‌టంలో సందేహం లేదు. మ‌రింత ఎగ్జ‌యిట్‌మెంట్‌, అప్‌డేట్స్ కోసం ఎదురు చూసేలా ప్రివ్యూ డేట్ అనౌన్స్‌మెంట్ సిద్ధం చేసింది.

రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లో  గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ సినిమాను నిర్మిస్తున్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. ప్ర‌పంచ వ్యాప్తంగా  ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago