హీరో సుమన్ చేతుల మీదుగా”ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ లాంచ్

Must Read

లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం ఆ ఆనందంగా ఉంది. సుమన్ గారికి కృతజ్ఞతలు.
లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ.. లక్మీ రాయ్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ట్రైలర్ చూశాను. ఫైట్స్ ఆదరగొట్టారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి చిత్రాలకు మంచి థియేటర్స్ దొరకాలి. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. విజయశాంతి గారు నటించిన ప్రతిఘటన, ఇలాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. ప్రతిఘటన చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించాలని కోరుతున్నాను అన్నారు.

ప్రముఖ డాన్సర్, నటి ఆక్సఖాన్ మాట్లాడుతూ.. గతంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ లక్మీ రాయ్ నటించిన “ఝాన్సీ ఐపీఏస్” చిత్రానికి ప్రత్యేకత ఉంది. మూడు పాత్రల్లో అద్భుతంగా నటించారు లక్మీ రాయ్. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు జెవిఆర్ మాట్లాడుతూ..ఆర్కే ఫిల్మ్స్ పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్న “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సదాశివ రెడ్డి, భాస్కర్ రావు, హీరో కిరణ్, అగర్వాల్, జి ఏస్ రెడ్డి, లక్మి తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News