విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ నుంచి ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే మెలోడీ పాట విడుదల

Must Read

అందమైన ప్రేమ కథగా ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో అందమైన ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే లవ్, మెలోడీ పాటను టీం విడుదల చేయించింది. ప్రస్తుతం ఈ పాట శ్రోతల్ని ఇట్టే కట్టిపడేస్తోంది. ఎంఎం కుమార్ బాణీ వినడానికి ఎంతో హాయిగా ఉంది. శివ సాహిత్యం , మేఘన, మనోజ్ గాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇక ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటేలా కనిపిస్తోంది.

ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘ఓ.. చెలియా’ నుంచి ‘నా కోసం ఆ వెన్నెల’ అనే ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశాను. ఈ పాట చాలా బాగుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Naa Kosam Aa Vennela Lyrical | O Cheliya Telugu Movie | Naga Pranav, Kaveri Karnika | Love Songs ❤️

ఈ చిత్రానికి సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

తారాగణం: నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి, అజయ్ గోష్, భోగిరెడ్డి శ్రీనివాస్, సారిపల్లి సతీష్, యశోద ఆర్ కొలిశెట్టి, సునీల్ రావినూతల, డార్లింగ్ దాస్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవి ప్రొడక్షన్స్
నిర్మాత: రూపశ్రీ కోపూరు
దర్శకుడు: నాగ రాజశేఖర్ రెడ్డి
కెమెరామెన్ : సురేష్ బాలా
సంగీతం : ఎంఎం కుమార్
ఎడిటింగ్ : ఉపేంద్ర
పీఆర్వో : సాయి సతీష్

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News