లబ్బర్ పందు, పొరింజు మరియం జోస్, సత్తై, అయలుం నానుమ్ తమ్మిల్, ఇష్క్, శుభరాత్రి, వాసంతి, ఆరాట్టు, సీబీఐ 5, కుమారి మొదలైన తమిళ, మలయాళ భాషల్లో నటించి స్వాసిక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్న స్వాసిక ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఆది సాయి కుమార్ హీరోగా సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల ఏ మిస్టిక్ వరల్డ్’లో స్వాసిక హీరోయిన్‌గా నటించారు.
శంబాల సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ప్రస్తుతం ఓ అప్డేట్ ఇచ్చింది. వసంత పాత్రలో స్వాసిక శంబాల చిత్రంలో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు.. ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్నింటినీ చూస్తుంటే సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేలా ఉంది.
ప్రస్తుతం స్వాసిక సూర్య 45వ చిత్రంలో నటిస్తున్నారు. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. శంబాల చిత్రం ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో శంబాల సినిమాను చిత్రీకరిస్తున్నారు.
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…
కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్ పొలిశెట్టి కెరీర్లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…