బ్రహ్మానందం కోసం వస్తారు.. రాజా గౌతమ్‌ను ఇంటికి తీసుకెళ్తారు.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే?

  • ‘బ్రహ్మానందం’ టైటిల్ మాకు దొరకలేదు. ‘బ్రహ్మా ఆనందం’ అని చివరకు మార్చాను. మా టీంలోని కో డైరెక్టర్ వీరు ఆ టైటిల్‌ను డిజైన్ చేశారు. నా ప్రతీ సినిమాను సొంతంగానే నిర్మించాను. ఈ మూవీని కూడా నా బ్యానర్ మీదే సొంతంగానే తీశాను. ఎలాంటి కొలాబరేషన్ పెట్టుకోలేదు.
  • తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా తాత కూడా నన్ను సక్సెస్ ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ మళ్లీ రావా టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాత గారికి నివాళిలా ఈ సినిమా ఉంటుందని కథకు ఓకే చెప్పా.
  • బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు అప్రోచ్ అయ్యారు. బ్రహ్మానందం గారు నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందం గారికి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ను చూడనటువంటి పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు.
  • ప్రస్తుతం బ్రహ్మానందం గారు ఎక్కువగా సినిమాల్ని చేయడం లేదు. చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రంగమార్తాండ చూశాక ఆడియెన్స్‌ బ్రహ్మానందం గారిని చూసే కోణం మారిపోయింది. కమెడియన్ అంటే కేవలం నవ్విస్తారనే ముద్ర వేస్తాం. కానీ బ్రహ్మానందం గారు అద్భుతమైన నటులు. ఈ కథ నచ్చి బ్రహ్మానందం గారు వెంటనే ఓకే చెప్పారు.
  • హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. వెన్నెల కిషోర్ గారి పేరుని బ్రహ్మానందం గారు రికమండ్ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ పంపాం. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నారు. హీరో బ్రహ్మా కారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ కారెక్టర్ గిరి బాగుంటుంది చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు. ఆ తరువాత రాజా గౌతమ్ గారి పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ అతను చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది. అతని షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానం నాకు చాలా నచ్చింది.
  • సినిమాని కొన్ని లెక్కలతో తీస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. లిమిటెడ్‌ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో సినిమా చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. నాకు పెద్ద లాభాలు రావాలని కూడా ఉండదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటా. కోటి మంది ఆడియెన్స్ ఉన్నారనుకుంటే.. వంద రూపాయలు సగటు అనుకుంటే.. వంద కోట్ల కలెక్షన్స్ వస్తాయి.. కానీ నాకు ఆ వంద కోట్లు అవసరం లేదు. నాకు ఓ ఇరవై కోట్లు వచ్చినా చాలు.
  • బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే నేను హిట్లు, ఫ్లాపు గురించి చెప్పను. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అతని పర్ఫామెన్స్, యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.
  • తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఓ అందమైన కథ. వినోదాత్మకంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది.
  • స్క్రిప్ట్ చదవడం, కథ తెలుసుకోవడం అనేది నిర్మాత ప్రథమ బాధ్యత. సినిమాకు ఏ టెక్నిషియన్ ఉంటే బాగుందో చర్చించడం, మంచి సినిమాను జాగ్రత్తగా తీయడం అనేది నిర్మాత బాధ్యత.
  • రాజా గౌతమ్‌తోనే మళ్లీ వైబ్ అనే ఓ సినిమాను చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు తెరెకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం సినిమా తరువాత ఆడియెన్స్‌కు రాజా గౌతమ్ ఏంటో అర్థం అవుతుంది. కథా చర్చలు జరిగే టైంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కానీ ఆ కథలోని సోల్ మిస్ కాకుండా చూసుకుంటాం.
  • బ్రహ్మా ఆనందం సినిమాను Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. భారీ తారాగణంను చక్కగా హ్యాండిల్ చేశారు. లెజెండరీ యాక్టర్లతో నిఖిల్ అద్భుతంగా చేయించుకున్నాడు. రొటీన్ అని కొంత మంది అనుకోవచ్చు. కానీ బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, రాజా గౌతమ్ పాత్రల మధ్య సీన్లకు అందరూ కనెక్ట్ అవుతారు.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

42 minutes ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago