Categories: Uncategorized

విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది.

ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. తాజాగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.

‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

4 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago