రవి మోహన్ స్టూడియోస్ గ్రాండ్ లాంచ్.. తొలి చిత్రంగా రానున్న ‘బ్రో కోడ్’

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్, కార్తీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి మోహన్ తన “రవి మోహన్ స్టూడియోస్” నిర్మాణ సంస్థను అందరికీ పరిచయం చేశారు. అనంతరం తన ప్రొడక్షన్‌లో రాబోతోన్న రెండు సినిమాల గురించి చెప్పారు. ఈ రెండింటిలో ఓ సినిమాను రవి మోహన్ తెరకెక్కిస్తుండటం విశేషం.

రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా ఓ చిత్రం రానుండగా, దర్శకుడు కార్తీక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్, ఎస్.జె.సూర్య, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో ‘బ్రో కోడ్’ సినిమా మరో సినిమాగా రూపొందనుంది. ఈ మూవీలో ఇంకా గౌరీ ప్రియ, శ్రద్ధా శ్రీనాథ్, మాళవిక మనోజ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సందర్భంగా…

హీరో కార్తీ మాట్లాడుతూ ..‘నేను రవిని స్టంట్ క్లాస్‌లో కలిశాను. అప్పుడు నేను ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చాను. రవి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రవి ఇలా ఇంత గ్రాండ్‌గా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. రవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. రవి ప్రొడక్షన్ కంపెనీలో రాబోతోన్న ‘బ్రో కోడ్’, యోగిబాబు ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ .. ‘రవి, నాలా అందరు నటులు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే, పరిశ్రమకు చాలా మంచి కథలు వస్తాయి.. మంచి పరిణామం చోటు చేసుకుంటుంది’ అని అన్నారు. దర్శకుడు రాజ మోహన్ మాట్లాడుతూ.. ‘మీతో పని చేయడాన్ని గర్వంగా భావిస్తుంటాను’ అని అన్నారు. కన్నడ నటుడు డాక్టర్ శివరాజ్.. ‘నేను రవి మోహన్ కోసం ఏమైనా చేస్తాను.. అతను చాలా మంచి వ్యక్తి’ అని అన్నారు.

హీరో, నిర్మాత, దర్శకుడు రవి మోహన్ మాట్లాడుతూ .. ‘కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను, కార్తీ ఇద్దరం కూడా విలాసాలను కోరుకోం, “పొన్నియిన్ సెల్వన్” షూటింగ్ సమయంలో మేం ఒకరినొకరం ఎంతో తెలుసుకున్నాం. సినిమా అనేది లక్షలాది మందికి వినోదం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. నాకు నా అభిమానులే ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను. సినిమాలో నేను ఇంకా సాధించాల్సిన కలలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నా స్వంత ప్రొడక్షన్ స్టూడియో. నేను ప్రారంభించిన ఈ కంపెనీ కేవలం నా సొంత చిత్రాల కోసమే కాదు. యువ, కొత్త దర్శకులకు అవకాశాలను ఇవ్వడం, ఎంతో మంది కలలకు రూపం ఇవ్వడం, సినిమాలు, OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రాజెక్టులు చేయడం నా ఉద్దేశం. కొత్త వారికి నేను ప్రాధాన్యం ఇస్తాను’ అని అన్నారు.

కెనిషా మాట్లాడుతూ .. ‘నువ్వు (రవి మోహన్) నాకు ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నా ఈ ప్రయాణం ఎంతో కష్టంగా సాగింది. కానీ నా కంటే ఎక్కువ కష్టాల్ని నువ్వు ఎదుర్కొన్నావు. నువ్వెప్పుడూ ఇతర జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రొడక్షన్ కంపెనీ పెట్టేందుకు చాలా కష్టపడ్డావు. నీకు ఎన్నో విజయాలు దక్కాలి’ అని రవి మోహన్ గురించి మాట్లాడారు.

నటుడు యోగిబాబు మాట్లాడుతూ .. ‘ఆరేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం అవకాశం ఇచ్చిన రవి మోహన్ గారికి థాంక్స్. దర్శకత్వం చేస్తే ఆ మొదటి చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని, ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమాను చేస్తున్నారు’ అని అన్నారు.

ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ రవి మోహన్ స్టూడియోస్ గొప్ప సక్సెస్‌ఫుల్ చిత్రాలను రూపొందించాలని అభిలషించారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

1 day ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago