ప్రముఖ దర్శక నిర్మాత రమేష్ వర్మ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ బ్యానర్ మీద నిర్మిస్తున్న ‘కొక్కొరొకో’ … పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ప్రముఖ దర్శక, నిర్మాత రమేష్ వర్మ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు గానూ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ ప్రొడక్షన్ కంపెనీ మీద నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ‘కొక్కొరొకో’ని ఆదివారం (ఆగస్ట్ 31) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ రోజు జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ మూవీతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

వినూత్నమైన కథతో, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా శ్రీనివాస్ వసంతల ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ప్రముఖ స్క్రీన్ రైటర్ జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ నేపథ్య గాయకుడు జివి సాగర్ ఈ మూవీకి సంభాషణలు రాసే బాధ్యతను స్వీకరించారు. తన తండ్రి వారసత్వాన్ని అనుసరించి ‘రాక్షసుడు’ తర్వాత రచయితగా రెండో ప్రాజెక్ట్‌ని సాగర్ చేపట్టారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాష్ ఆర్ జోషి, లండన్‌కు చెందిన ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని రేఖ వర్మ, కూరపాటి శిరీష నిర్మాతలుగా.. నీల్లాద్రి ప్రొడక్షన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ పూడి పని చేయనున్నారు.

ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ స్వయంగా రూపొందించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌లో మొదటి చిత్రంగా తెలుగులో ఓ చక్కటి ఆంథాలజీ కానుందని, అద్భుతమైన విజువల్స్, మంచి ఎమోషన్స్‌తో ‘కొక్కొరొకో’ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago