డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా వుంది: హీరోయిన్ నభా నటేష్
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనతో డార్లింగ్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. నిన్న శ్రీరాములు థియేటర్, ట్రిపుల్ ఏ లో ప్రిమియర్స్ హౌస్ ఫుల్ షోస్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ రెస్పాన్స్ అదిరిపోయింది. కామెడీ, ఎమోషన్స్ కి అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మనఇంట్లోనే మనం చేసిన వర్క్ కి ఆలాంటి అప్రిషియేషన్ వస్తే ఆ సంతోషం వేరుంటుంది. విమెన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి డార్లింగ్ చూడాలని కోరుకుంటున్నాను. డార్లింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి డార్లింగ్ చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ డార్లింగ్ డే. థాంక్ యూ’ అన్నారు.
హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎక్కువమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు సినిమాని, దర్శి, నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు. జనాలు చాలా నచ్చుతుంది. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. ప్రిమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ పడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ సపోర్ట్ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు
డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. డార్లింగ్ మేము ఊహించినట్లే ఆడియన్స్ కి అద్భుతంగా రీచ్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఫ్యామిలీ, విమెన్ ఆడియన్స్ డార్లింగ్ ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం’ అన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…