Categories: Uncategorized

‘డార్లింగ్’ని ఎంజాయ్ చేయండి: సక్సెస్ మీట్ లో హీరో ప్రియదర్శి

డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా వుంది: హీరోయిన్ నభా నటేష్

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల  నుంచి అద్భుతమైన స్పందనతో డార్లింగ్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. నిన్న శ్రీరాములు థియేటర్,  ట్రిపుల్ ఏ లో ప్రిమియర్స్ హౌస్ ఫుల్ షోస్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ రెస్పాన్స్ అదిరిపోయింది.  కామెడీ, ఎమోషన్స్ కి  అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూసిన మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది. మనఇంట్లోనే మనం చేసిన వర్క్ కి ఆలాంటి అప్రిషియేషన్ వస్తే ఆ సంతోషం వేరుంటుంది. విమెన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందరి నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి డార్లింగ్ చూడాలని కోరుకుంటున్నాను. డార్లింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా. తప్పకుండా థియేటర్స్ కి వచ్చి డార్లింగ్ చూసి ఎంజాయ్ చేయండి. హ్యాపీ డార్లింగ్ డే. థాంక్ యూ’ అన్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎక్కువమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు సినిమాని, దర్శి, నా కెమిస్ట్రీని చాలా ఇష్టపడుతున్నారు. జనాలు చాలా నచ్చుతుంది. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. ప్రిమియర్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ పడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ సపోర్ట్ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ.. డార్లింగ్ మేము ఊహించినట్లే ఆడియన్స్ కి అద్భుతంగా రీచ్ అయ్యింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఫ్యామిలీ, విమెన్ ఆడియన్స్ డార్లింగ్ ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం’ అన్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago