నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదుగా అష్టదిగ్బంధనం ఫస్ట్ సింగిల్ లాంచ్

బాబా పి.ఆర్ దర్శకత్వంలో సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా “అష్టదిగ్బంధనం” ఎ గేమ్ విత్ క్రైమ్ “అనేది ట్యాగ్ లైన్”. సెప్టెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది సినిమా యూనిట్. బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఐయామ్ విత్ యూ అనే సాంగ్ ను నేషనల్ అవార్డు విన్నింగ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా లాంచ్ చేశారు.


ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ‘’ఇప్పుడే అష్టదిగ్బంధనం సాంగ్ చూశాను, చాలా బాగుంది. చాలా కమర్షియల్ గా ఉంది. హీరో అండ్ హీరోయిన్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఈ సినిమాను మంచి కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.


దర్శకుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ ‘’మేము రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఉప్పెన, ఆర్సీ 16 సినిమాల డైరెక్టర్ బుచ్చిబాబు గారి చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్ సింగిల్ ఐయామ్ విత్ యూ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆయన ట్రైలర్ కూడా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. రెస్పాన్స్ కూడాబాగా వస్తోంది. ఇదే విధంగా సెప్టెంబర్ 22న రిలీజ్ అయ్యే మా సినిమా మీకు నచ్చుతుందని, మీ అందరి రెస్పాన్స్ కూడా బాగుంటుందని మేము నమ్మకంగా ఉన్నాము. సెప్టెంబర్ 22న మా సినిమా థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ‘’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి థాంక్స్. బుచ్చిబాబు గారు ఈరోజు సమయం ఇచ్చి సాంగ్ లాంచ్ చేశారు. ఆయనకు సాంగ్ బాగా నచ్చింది, అందరికీ అలాగే నచ్చుతాయని నమ్మకం ఉంది. సెప్టెంబర్ 22న మా సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, మీ అందరికీ ఈ సినిమా వేల్యూ ఫర్ మనీ కనిపిస్తుంది. మీరు అందరూ సినిమా థియేటర్లకు వచ్చి మా లాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి’’ అన్నారు.


హీరో సూర్య భరత్ చంద్ర మాట్లాడుతూ ఐయామ్ విత్ యూ అనే సాంగ్ ను బుచ్చిబాబు గారు లాంచ్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు లాప్టాప్ లో విన్నా సగం వినేసి సాంగ్ నచ్చడంతో స్పీకర్ లో పెట్టుకుని విన్నారని అన్నారు. అది చాలా బూస్టింగ్ ఇచ్చింది. ట్రైలర్ చూసి అది కూడా బాగుందని అన్నారు. సెప్టెంబర్ 22న రిలీజ్ అయ్యే మా సినిమా అందరూ థియేటర్లలో చూసి ఎంకరేజ్ చేయండి’’ అని కోరారు.

హీరోయిన్ విషిక మాట్లాడుతూ ‘’ మా సినిమా ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బుచ్చిబాబు గారు మా మొదటి సాంగ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 22న రిలీజ్ అయ్యే మా సినిమా అందరూ థియేటర్లలో చూసి కొత్త వారందరినీ ఆశీర్వదించండి’’ అని అన్నారు.

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
రచన – దర్శకత్వం: బాబా పి.ఆర్,
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్,
మ్యూజిక్: జాక్సన్ విజయన్
కెమెరా: బాబు కొల్లబత్తుల
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల,
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల,
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి,
ఆర్ట్: వెంకట్ ఆరే
పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి,
పబ్లిసిటీ డిజైనర్: వివా రెడ్డి,
ప్రొడక్షన్ మేనేజర్: కుర్మ భీమేష్,
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన సావ్దేరక్,
మేకప్: జి.శివ,
కాస్టూమర్: ప్రవీణ్
స్టిల్స్: శ్రీకాంత్.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago