‘బహుముఖం’ యూనిక్ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్:హీరో- డైరెక్టర్ హర్షివ్ కార్తీక్

Must Read

యంగ్ ట్యాలెంటెడ్ హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం ‘బహుముఖం’. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్  జార్జియా,  USA పరిసర ప్రాంతాలలో అనేక అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న సినిమా విదుదలౌతుంది. ఈ నేపధ్యంలో హర్షివ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘బహుముఖం’ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-తొలుత ఒక డిఫరెంట్ వేరియేషన్ షార్ట్ ఫిల్మ్ తీసి నన్ను నేను నిరూపించుకోవాలని భావించాను. షార్ట్ ఫిల్మ్ నిడివి తక్కువ వుంటుంది అలాగే ఇంపాక్ట్ ఎక్కువగా వుంటుంది. అయితే ‘బహుముఖం’ ఐడియా నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. మానసిక అనారోగ్యం వున్న వ్యక్తి ఓ ఆడిషన్ కు వెళ్తే అక్కడ అతనికి అవమానం జరిగితే తర్వాత అతను ఎంతవరకూ వెళ్తాడనే అనేది లైన్. కథ రాస్తున్నపుడు స్పాన్ పెరిగింది. ఇలాంటి కథ మన దగ్గర ఇప్పటివరకూ రాలేదనే నమ్మకం కుదిరిన తర్వాత దీనిని ఫీచర్ ఫిల్మ్ లెంత్ ఫిలిం చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. నటుడిగా దర్శకుడిగా ఓ యూనిక్ ప్రాజెక్ట్స్ తో రావాలని ఈ ప్రాజెక్ట్ చేశాను.

సినిమాల్లో పని చేసిన అనుభవం ఉందా?
-నేను యుఎస్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తాను. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. పార్ట్ టైం గా ఎవరిదగ్గరికైనా వెళ్లి పని చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. సమయం వృధా అయ్యింది కానీ సరైన ప్రాజెక్ట్ కుదరలేదు. ఇక నేనే సొంతగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. జాబ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిది ఆన్ లైన్ లో నేర్చుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాబ్ తో పాటు ప్యాషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాను.

నటన విషయంలో ఎలా ప్రిపేర్ అయ్యారు ?
-సినిమాలో నేను వుండకూడదు, కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. దీనికోసం ఆన్ లైన్ లో చాలా మెళకువలు నేర్చుకున్నాను. కొన్ని ఆర్ట్స్ ఫామ్స్ చాలా ప్రాక్టిస్ చేశాను. కథక్ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను.  

సినిమా అంతా యుఎస్ లో తీశారా ?
-అవునండీ.. ‘మేడిన్ యూఎస్ఎ.. అసెంబుల్ ఇండియా’ అనే ట్యాగ్ తో ప్రమోషన్స్ చేస్తున్నాం. ఎక్కడ రాజీపడకుండా సినిమా చేశాను. ప్రతిది వర్క్ షాప్ నిర్వహించి చాలా క్లియర్ విజన్ తో సినిమాని రూపొందించాం. చాలా డిపార్ట్మెంట్స్ ని నేనే హ్యాండిల్ చేయడానికి కారణం కూడా కాస్ట్ తగ్గించాలనే. పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేయడం చాలా కలిసొచ్చింది. ఇందులో దాదాపు నలభై మంది కొత్తనటీనటులు కనిపిస్తారు. రోజుకి దాదాపు 14 గంటలు పాటు వర్క్ చేశాను. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వుండేలా సినిమాని రూపోందించాను. సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా వుంటుంది.


ఫణి కళ్యాణ్, శ్రీచరణ్ పాకాల లాంటి ప్రముఖ సంగీత దర్శకులని ఎలా అప్రోచ్ అయ్యారు ?

-పాటలు ఫణి కళ్యాణ్ గారు చేశారు. ఆయన మెలోడీలని అద్భుతంగా చేస్తారు. ఈ సినిమా కోసం చాలా మంచి పాటలని స్వరపరిచారు. నేపధ్య సంగీత కోసం శ్రీచరణ్ పాకాల గారిని సంప్రదించాను. ఆయన నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నా పాషన్, కమిట్మెంట్ ఏమిటో కూడా గ్రహించారు. టీజర్ చూపించాను. ఆయన చాలా నచ్చింది. తర్వాత కథ అంతా విన్నారు. చాలా బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.    

మీలో ప్రభుదేవా, శింబు ఛాయలు కనిపిస్తున్నాయి ? ఎవరైనా చెప్పారా ?
-చెప్పారండి. కొందరు ‘విజయ్ లా వుంటావ్’ అని కూడా అన్నారు. అది నా అదృష్టం అనుకుంటాను.

సినిమాని ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
-చాలా మంచి డిజిటల్ ప్రమోషన్స్ చేశాం. అలాగే ప్రమోషన్స్ లో నేరుగా ప్రేక్షకులని కలవడం వలన వారికి ఎలాంటి సినిమాలు కావాలి ? వారి అలోచన ధోరణి ఎలా వుందో కూడా తెలుసుకోగలిగాను. ఇవన్నీ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి హెల్ప్ అవుతాయి. ఈ జర్నీ, ప్రాసస్ ని చాలా ఎంజాయ్ చేశాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్  ?
-ఒక యాక్షన్ డ్రామా రాసుకున్నాను. ఐతే ఈ ప్రాజెక్ట్ లో మాత్రం అన్నీ కాకుండా ఎదో ఒకదానిపై ద్రుష్టి పెట్టాలని వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News