సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ వారు సంయుక్తంగా రూపొందించిన చిత్రం వెనమ్. ఈ మూవీ సిరీస్ లో మూడవ భాగం వెనమ్ – ది లాస్ట్ డాన్స్ ఈ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన వెనమ్ మూవీ సిరీస్ లో మొదటి, రెండు భాగాలు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ ని వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న వెనమ్ – ది లాస్ట్ డాన్స్ పై భారీ అంచనాలు ఏర్పడాయి. ఆ అంచనాలకి తగ్గట్లుగానే ఇప్పటివరకు విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. తాజాగా విడుదలైన వెనమ్ – ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంది.
ప్రముఖ హాలీవుడ్ టామ్ హార్డీ ప్రధాన పాత్రలో ఈ సినిమా సిరీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్ వంటి సినిమాల్లో నటించి టామ్ హార్డీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టామ్ హార్డీ నటనతో పాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సన్నివేశాలు వెనమ్ – ది లాస్ట్ డాన్స్ లో హైలట్ గా నిలవబోతున్నాయి. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్ వారు ఎక్స్ క్లూసీవ్ గా ఇండియాలో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. వెనమ్ – ది లాస్ట్ డాన్స్ 3డి తో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్ లో ప్రేక్షకుల్ని అలరించనుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…