మూకీ చిత్రం” కావ్య రాజ్ ” ట్రైలర్ విడుదల.

Must Read

గజగౌని ప్రొడక్షన్ పతాకంపై, కవిత రాజ్ పుత్, జమున, అంజలి,మధు, హీరో హీరోయిన్లుగా,మధులింగాల దర్శకత్వంలో, నిర్మాత గజ గౌని దయానంద్ గౌడ్ నిర్మిస్తున్న, యాక్షన్ ఎంటర్టైనర్, “కావ్య రాజ్”. ఈ చిత్రం ఇటీవల “ట్రైలర్ “లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ గారు విచ్చేసి చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు . ఇంకా ఈ కార్యక్రమంలో రావణ లంక హీరో క్రిష్, కోరియో గ్రాఫర్ కట్ల రాజేంద్ర ప్రసాద్, మధుకర్ రెడ్డి, చైల్డ్ ఆర్టిస్ట్ గజగౌని శివాంశ్ గౌడ్ , కంచర్ల లక్ష్మి కాత్యాయిని, శ్రీ భరణి, మల్లికార్జున్ గౌడ్ , పి అర్ ఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దయానంద్ గారు మాట్లాడుతూ”ఈ సినిమా మామూలు సినిమా కాదు. తెలంగాణ మొట్టమొదటి మూకీ చిత్రం. ఈ చిత్రాన్ని పైడి జయరాజు గారికి అంకితం ఇస్తున్నాం. ఎందుకంటే భారత సినీ రంగంలో, తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలంగాణ నటుడు,నిర్మాత, దర్శకుడు,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన సూపర్ స్టార్ మూవీ మొఘల్, అయినటువంటి పైడి జయరాజు గారికి సరైనటువంటి గౌరవం దక్కలేదని నేను చింతిస్తూ, ఈ సినిమాను పైడి జయరాజు గారికి అంకితం ఇస్తున్నాను. దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో. శిఖర సామాన్యుడిగా నిలిచి. తెలంగాణ నేల నుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జయరాజ్ గారిని, ఈ విధంగా సత్కరించుకోవడం అనేది నాకు గర్వకారణం. ఈ విధంగానైనా. పైడి జయరాజు గారు అందరికీ తెలుస్తారని. చిన్న ఆశతో ఈ సినిమాని, తొలి తరం మహానటుడు,మూవీ మొఘల్, పైడి జయరాజు గారికి. అంకితం ఇవ్వడం జరిగింది. అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ” దయానంద్ గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. దయానంద్ గారు వాట్సాప్ గౌడ గ్రూపు లో వున్నవారిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈ చిత్రం నిర్మించడం సంతోషదాయకం. చాలా కాలం తర్వాత మంచి మూకీ సినిమా రాబోతుంది. ఈ సినిమానిప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా ; గిరి,
స్టిల్స్ : అనిల్, ఎస్, ఎఫ్ ఎక్స్ : సాల్మన్, ఎడిటర్ : శ్రీనివాస్,
నిర్మాత : దయానంద్ గౌడ్ గజ గౌని
పి అర్ ఓ : బాశిoశెట్టి వీరబాబు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News