యూత్ కి కనెక్ట్ అయ్యే “నీతో” మూవీ ట్రైలర్

Must Read

అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర ట్రైలర్  ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.”మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్  అయిందో  గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్  అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి.

Neetho Official Trailer 2022 | Aberaam Varma | Saathvika Raj | Balu Sharma | Vivek Sagar

ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా  ఆసక్తికరంగా మలిచారు చిత్ర యూనిట్.వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ‘నీతో’ ఈ నెల 30వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది.

సినిమా: నీతో
నటీనటులు: అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, మోహిత్ బైద్, పవిత్రా లోకేష్, పద్మజా ఎల్, గురురాజ్ మానేపల్లి, సంజయ్ రాయచూర,
లేట్. Tnr (తుమ్మల నరసింహా రెడ్డి), స్నేహల్ జంగాల, AV R స్వామి, C S ప్రకాష్, సందీప్ విజయవర్ధన్, కృష్ణ మోహన్, రాజీవ్ కనకాల
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కాస్ట్యూమ్ డిజైన్: సంజన శ్రీనివాస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: స్మరన్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, వరుణ్ వంశీ. బి, శ్రీనివాస మౌళి
ప్లే బ్యాక్ సింగర్స్: హరి హరన్, గౌతం భరద్వాజ్, వివేక్ సాగర్, అదితి భవరాజు, మనీషా ఈరబతిని, లిప్సికా భాష్యం
దర్శకత్వ బృందం: శ్రీధర్ చుక్కల, శివ కిరణ్, శ్యామ్ బంధువుల, సయ్యద్ షకీర్, అనిల్ కుమార్ ఎల్లిగారి, అభిలాష్ సిర్రా
సినిమాటోగ్రఫీ బృందం: లెవిన్ అల్ఫోన్స్, యోగేష్ ఎం, గురునాథ్ వి ఎస్

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News