నాగచైతన్య ఇప్పుడు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నారు. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించనిదే అస్సలు చేయడం లేదు. ఆ మాటకొస్తే, కథల విషయంలో కూడా పునరాలోచిస్తున్నారు.. అంటూ ఈ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఆ విషయాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసేలా ఉంది ఆయన లేటెస్ట్ ట్వీట్. ఎన్‌సీ22 యాక్షన్ బిగిన్స్ అంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశారు చైతన్య. నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరక్షన్‌లో మొదలైన సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
వెంకట్ ప్రభు సినిమాల్లో స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఉంటుంది. అలాగే, ఫన్‌కి ఏమాత్రం కొదవుండదు. అయితే వాటికి భిన్నంగా యాక్షన్ పంథాలో ఉండనుంది నాగచైతన్య సినిమా. నాగార్జున కెరీర్‌లో ఇళయరాజా మ్యూజిక్‌కి ఉన్న స్థానం గురించి అక్కినేని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పుడు నాగచైతన్యకు ఇళయరాజా ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటారోనని ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టారు నాగచైతన్య. ఆయన తొలి బాలీవుడ్ వెంచర్ లాల్‌సింగ్ చడ్డా మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఈ మధ్య తెలుగులో విడుదలైన థాంక్యూ కూడా నిరాశపరచింది. అందుకే ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు నాగచైతన్య.డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ చెప్పిన కథ మీద కూడా రీ వర్క్ చేయమని సలహా ఇచ్చారట అక్కినేని పెద్దబ్బాయి. ఇంకో వైపు నాగచైతన్య ఓటీటీ డెబ్యూ ధూత కంప్లీట్ అయింది. కొన్నాళ్ల పాటు కథలు వినకుండా గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఫ్రెష్‌గా వినాలని భావిస్తున్నారట చైతన్య.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…