డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి గ్రేస్‌ఫుల్ నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్
తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ నందమూరి తారక రామారావు గ్రేస్‌ఫుల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. ఈ వీడియో వైవిఎస్ చౌదరి క్రియేటివ్ విజన్, యంగ్ హీరోకి తనపై ఉన్న కాన్ఫిడెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఎన్టీఆర్ తన పొడవాటి జుట్టు, దృఢమైన శరీరాకృతితో అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. అర్ధవంతమైన పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను అలరిస్తానని, పరిశ్రమకు విధేయుడిగా ఉంటానని తన తాత ఎన్టీఆర్‌పై ప్రమాణం చేస్తూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో 18 నెలల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందానని, తన అంకితభావాన్ని వెల్లడించారు.
ఈ యువ హీరో స్టార్‌గా ఎదగడానికి కావలసిన అన్ని లక్షణాలను ప్రదర్శిస్తూ తన బేస్ వాయిస్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. YVS చౌదరి అతనిని డైనమిక్ పాత్రలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి వీణా రావు కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.ఆస్కార్-విజేత MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరొక ఆస్కార్-విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ భారీ అంచనాల చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
నందమూరి తారక రామారావు విభిన్న సామర్థ్యాలను హైలైట్ చేసేలా వైవిఎస్ చౌదరి కథ, స్క్రీన్‌ప్లే రూపొందించారు. ఇది తెలుగు సినిమా అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ… నేను రాసుకున్న కథని మోయగలిగి, ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే దమ్మున్న క్యారెక్టర్ ని పోషించగల సత్తా ఉన్న ప్రధాన సూత్రధారి అయిన కథానాయకుడిని ఈ వేడుక ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిపై వున్న అభిమానం, ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో వున్నాను. ఎన్టీఆర్ అనే పేరు మూడు అక్షరాల తారకమంత్రం. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది. ఈ హీరోకు కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు వుంటాయి. నేను అందరి హీరోల అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తాను. నేను ఇప్పటివరకు పరిచయం చేసిన హీరోలందరినీ ఫ్యాన్స్ ఆదరించారు. అలానే ఈ తారకరామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొదటిసారి ఎన్టీఆర్‌ని చూడగానే అతడి కళ్లు, కనుబొమ్మలు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంతో అణుకువగా ఉంటారు. అతడి వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది. నందమూరి కుటుంబంలో నుంచి అద్భుతమైన హీరో అవుతాడని నమ్మకం ఉంది. ఎన్టీఆర్ గారి జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపిన చిత్రం సర్దార్ పాపారాయుడు. ఆ చిత్రం అక్టోబర్ 30న రిలీజ్ అయింది. ఇదే రోజున మా ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం రిలీజ్ అయిన రోజునే ఇంకో నందమూరి తారక రామారావు ని పరిచయం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. రాఘవేంద్రరావు గారు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వాదం అందించడం చాలా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే అశ్విని దత్ గారితో నా ప్రయాణం చాలా గొప్పది. అలాగే రామారావు గారితో వాళ్ళిద్దరి ప్రయాణం అద్భుతం. అలాంటి గొప్పవ్యక్తులు ఇద్దరు వచ్చి ఈ రోజున మా యువ హీరో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభా పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మా కథానాయకుడికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను’అన్నారు.
డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, అతిధులకు నమస్కారం. నందమూరి వంశంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ పిక్చర్ తో నిర్మాత, దర్శకుడు, కొత్తగా పరిచయం అవుతున్న హీరో అఖండ విజయం సాధించాలని, అన్నగారి ఆశీస్సులతో ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయి అందరికీ మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ..పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మా చౌదరి ఇలాంటి గొప్ప పని ఎంతో ఓర్పుతూ నేర్పుతో చేసి నిలదొక్కుకుంటాడని నాకు మా సంస్థలో అతను పనిచేసిన రోజుల నుంచి గొప్ప అభిమానం. అదే విధంగా ప్రూవ్ చేశాడు. ఆల్ ది బెస్ట్ చౌదరి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు
తారాగణం: నందమూరి తారక రామారావు, వీణా రావు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి
బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @
నిర్మాత: యలమంచిలి గీత
సంగీతం: ఎంఎం కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి
పీఆర్వో: వంశీ-శేఖర్
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్…
Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…