బెల్లంకొండ గణేష్”నేను స్టూడెంట్ సార్!”జూన్ 2న విడుదల

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ  ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్. ‘నేను స్టూడెంట్ సార్!’ జూన్ 2న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. జూన్ రెండవ వారం తర్వాత విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తాయి కాబట్టి ఇది అనువైన డేట్.

గణేష్,  అవంతిక దస్సాని సహా ప్రముఖ తారాగణం ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచనున్నారు.

సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి కెమెరామెన్ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో  వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago