సత్యదేవ్ పాన్ఇండియామూవీ ‘జీబ్రా’ త్వరలోనే ఫస్ట్ లుక్

సత్యదేవ్, డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్, పద్మజ ఫిలింస్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పాన్ ఇండియా మూవీ ‘జీబ్రా’ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం, త్వరలో ఫస్ట్ లుక్ విడుదల

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్  క్రైమ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘జీబ్రా. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ట్యాగ్ లైన్.  

పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.

ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది. మేకర్స్ ఈ రోజు పోస్ట్ ప్రొడక్షన్ పనులు  ప్రారంభించారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్థిక నేరాల నేపథ్యంలో యధార్ధ సంఘటన స్ఫూర్తితో  ఈ చిత్రం రూపొందుతోంది.  

ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సుమన్ ప్రసార బాగే సహ నిర్మాతగా వున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
అదనపు స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: సుమన్ ప్రసార బాగే
డీవోపీ: సత్య పోన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్ : అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని మల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago