నేషనల్ క్రష్ రష్మిక చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ నుంచి ‘యూ ఆర్ మై డీపీ’ పాట విడుదల

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని జూలై 21న రిలీజ్ చేయబోతోన్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్లు రిలీజ్ చేశారు. యూ ఆర్ మై డీపీ అంటూ సాగే ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రోతలను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. సురేష్ గంగుల రాసిన ఈ పాట, భీమ్స్ ఇచ్చిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. సాయి మాధవ్, స్వాతి రెడ్డిలు ఆలపించిన ఈ పాట అందరినీ అలరించేలా ఉంది.

ఇక ఈ పాటలో సంజయ్ రావు స్టైలింగ్, ఆయన వేసిన స్టెప్పులు, ప్రణవి మానుకొండ లుక్స్ బాగున్నాయి. చూస్తుంటే ఈ లిరికల్ వీడియోలో యూట్యూబ్‌లో కచ్చితంగా ట్రెండ్ అయ్యేట్టుగా ఉంది.

ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.
ఎడిటర్ – వైష్ణవ్ వాసు
సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి
పీఆర్వో – జీఎస్కే మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి
బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ
సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల
ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago