‘భోళా శంకర్’ నుంచి గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్ జామ్ జామ్ జజ్జనక విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ నుంచి గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్ జామ్ జామ్ జజ్జనక విడుదల

మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ నుంచి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండా ఒక వీడియోను లీక్ చేసారు మెగాస్టార్. ఆ పాట మేకింగ్‌లోని గ్రాండ్‌నెస్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు, మేకర్స్ జామ్ జామ్ జజ్జనక  పాటను విడుదల చేశారు.

ఇది భోళా శంకర్ గ్రాండ్ సెలబ్రేషన్ సాంగ్. మహతి స్వర సాగర్ పార్టీ, సెలబ్రేషన్ వైబ్‌లను కలిగి ఉన్న పాటని స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలాపించారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించారు.  మధ్యలో పాపులర్ ఫోక్ నెంబర్ నర్సపల్లెని మిక్స్ చేయడంతో పార్టీ వైబ్ మరొక స్థాయికి వెళ్ళింది.  

చిరంజీవి డాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగా వున్నాయి. పాటలో లైవ్లీగా కనిపించారు మెగాస్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో చిరంజీవితో పాటు తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ అలరించారు. సంగీత్, ఇతర వేడుకలకు ఈ పాట ఫస్ట్ ఛాయిస్ గా నిలవనుంది.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Tfja Team

Recent Posts

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన “రాక్షసుడు” నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…

21 hours ago

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ

హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…

22 hours ago

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago