అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ ..
‘‘నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు. సెలక్ట్ అయ్యాను. అయితే పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించాను. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్‌ను గమనించాను. వారెలా నడుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలను గమనించాను. ఈ క్రమంలో డైరెక్టర్‌గారు ఎయిర్ హోస్టస్ పాత్ర చేయటానికి నాకు కొన్ని రెఫరెన్స్‌లనిచ్చారు. అవేంతో ఉపయోగపడ్డాయి. టాలీవుడ్ నటించటం నటిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ప్రిషకు అభిరుచి ఎక్కువ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అడవుల్లో వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన యాత్రికులతో కలిసి సఫారీల్లో వెళ్లి అక్కడి జంతువులను తన కెమెరాల్లో బంధిస్తుంటుంది ప్రిష.
‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవలం జంతువులను, చెట్లకు సంబంధించిన ఫొటోలను కెమెరాల్లో బంధించటం మాత్రమే కాదు. వాటికి సంబంధించి సహజమైన భావోద్వేగాలను బంధించటమే. అలాంటి విషయాలను నా కెమెరాలో బంధించినప్పుడు సంతృప్తిని, మంచి అనుభవాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. నటన పరంగానూ ఇది నన్ను మెరుగుపరుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా నటించగలుగుతున్నాను’’ అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…