వెల్కమ్ టు తిహార్ కాలేజ్ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్

Must Read

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను పాత్రికేయ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ “వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అనే సినిమా నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా సునీల్ కుమార్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం లోని అంశాలు నాకు కళ్ళకు కట్టినట్టు అర్థం అయ్యాయి. లాక్ డౌన్ ముందు మొదలుపెట్టిన ఈ సినిమాని మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం చాలామంది స్టూడెంట్స్ యొక్క ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని అదే అంశాల్ని సినిమాలో చూపించాము ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం ని అలాగే ప్రైవేటు రంగంలో చేస్తున్న మోసాలు కళ్ళకు కట్టినట్టు చూపించాము అక్టోబర్ 28 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది మా సినిమాని స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రత్యేకంగా చూడాలని అలాగే మా సినిమా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టం లో కొంచమైనా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

హీరోయిన్ సోనీ రెడ్డి మాట్లాడుతూ వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా 2019లో మొదలైంది . ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్నాను నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా మొదటి సినిమా ఇదే అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఇంటర్ చదివే టైంలో నేను ఫేస్ చేసినటువంటి అనేక సంఘటనలు ఈ సినిమాలో డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చూపించారు.కీలక పాత్ర పోషించి నటువంటి ఫణి చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా మా సినిమా కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని ఈ సినిమాలో నేను నటించేటప్పుడు చాలా ప్రౌడ్ గా హ్యాపీ గా ఫీల్ అవుతూ చేశాను మా సినిమాను ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.మరొక హీరోయిన్ మాట్లాడుతూ మొదట నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ సర్ మీరు నాకు ఆఫర్ ఇవ్వబోతే సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్థానం ఉండేది కాదు సినిమా ఇండస్ట్రీలో నాకు ఎన్ని సినిమాలు వచ్చిన ఫస్ట్ స్థానం సునీల్ కుమార్ రెడ్డి గారికి ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా చేసాము నేను చేస్తున్న క్యారెక్టర్ చూసి నా ఇంటర్మీడియట్ నా ఎడ్యుకేషన్ సిస్టం గుర్తొచ్చింది ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూసి సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం రావాలని కోరుకుంటున్నాను.

నిర్మాత మాట్లాడుతూ సునీల్ కుమార్ రెడ్డి గారి కాంబినేషన్ లో ఇది నాది మూడో సినిమా నేను స్టేట్స్ లో ఉంటూ సునీల్ కుమార్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేసే వారిని అలా వరుసగా మా ఇద్దరి మధ్య సంబంధం పెరిగి సునీల్ కుమార్ రెడ్డి గారి యొక్క మార్క్ ప్రతి సినిమాలో చూపించడం జరిగింది. అలాగే వెల్కమ్ టు తీహార్ కాలేజ్ అనే సినిమాలో కూడా సునీల్ కుమార్ రెడ్డి యొక్క ప్రత్యేకతను కనబరిచారు మా సినిమా అక్టోబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఇలాంటి సినిమాలో భాగమైనందుకు మా హీరో హీరోయిన్ కి డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి బాపిరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు .నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని మా సినిమా ప్రోత్సహిస్తున్న తోడుగా ఉంటున్న మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సినిమాని ఎలాంటి లాబా పక్షాన లేకుండా మా నిర్మాతలు తమ రక్తాన్ని ధారపోసి మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు తన శ్రమని పెట్టి విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల కోసం ఎడ్యుకేషన్ సిస్టం కోసం చేసిన ప్రయత్నమే మా వెల్కం టు తీహార్ కాలేజ్ ఈ సినిమాని ప్రేక్షకులకు చేరవేసేలా మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్రతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావడానికి కారణం అవుతుంది ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మన ఎడ్యుకేషన్ సిస్టం ఎంత ఫెయిల్యూర్ లో ఉందో , నేను గతంలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అనుకున్న కథ అనుకున్నట్టుగా తీయగలిగాను. ఈ సినిమా చూసి ఏ ఒక్క స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా తన భవిష్యత్తు తన కుటుంబం తన మనోధైర్యాన్ని నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను అలానే అక్టోబర్ 28న విడుదలయ్యే మా సినిమా విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యం ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చూసి మా సినిమా ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు
కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.
కలరింగ్ అమల్
వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News