తెలుగు ప్రేక్షకులంతా సెలబ్రేట్ చేసుకునేలా ‘జాతర’ ఉంటుంది

Must Read

సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను తన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ.

  • దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తుంటాడు. ఆ పితలాటకం నుంచి అమ్మవారిని హీరో ఎలా రక్షిస్తాడు అనేది ఈ చిత్ర మూల కథాంశం. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా ‘జాతర’ చిత్రంలో చూపిస్తున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రాన్ని డాక్యుమెంటరీగా తీస్తే వివాదాలు వస్తాయి. సినిమా అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందించవచ్చు అనిపించింది.
  • హీరో క్యారెక్టర్ మూడు డైమెన్షన్స్ లో ఉంటుంది. అతను ఒక ఫేజ్ నుంచి మరో ఫేజ్ కు వెళ్లేందుకు ప్రేమ అనేది ఒక మీడియంలా ఉంటుంది. అలా ఈ కథలో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. మంచి సౌండ్ డిజైనింగ్ ఈ మూవీ కోసం చేశాం. మనం జంధ్యాల గారి సినిమాల్లో విన్నట్లు విలేజ్ లో వినిపించే సహజమైన సౌండ్స్ తరహాలో ‘జాతర’ చిత్రంలో సౌండ్ డిజైనింగ్ చేయించాం.
  • 2016 లో నేను ‘జాతర’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ గారు నేను అనుకోకుండా ఒక ఫంక్షన్ లో మీట్ అయ్యాం. అక్కడ మా ఐడియాస్ షేర్ చేసుకున్నాం. నేను చెప్పిన పాయింట్ ఆయనకు నచ్చి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తోనూ డిస్కస్ చేశారు. వాళ్లు కూడా బాగుందని అనడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నన్నే డైరెక్షన్ చేయమని ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సినిమా చేయడంలో ఎంతో సపోర్ట్ అందించారు.
  • చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయి, రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ చేసుకున్నాం. గంగమ్మతల్లిని తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’.
  • ఒక పెద్ద హీరోతో ‘జాతర’ సినిమా చేయాల్సింది. అయితే మాకు వారిని అప్రోచ్ అయ్యే దారి తెలియదు. ఆరు నెలల పాటు ప్రయత్నించినా కుదరలేదు. దాంతో నేనే హీరోగా నటించాను. ‘జాతర’ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులను పెడదామని ప్రపోజల్ వచ్చినా నేను వద్దని చెప్పాను. ఇది స్థానిక మూలాలున్న కథ. అక్కడి నటీనటులు అయితేనే సహజంగా ఉంటుందని భావించాం. అలాగే తెలుగు తెలిసిన హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నించినా మా బడ్జెట్ కు కుదరలేదు. దీయా రాజ్ బాగా యాక్ట్ చేసింది.
  • మా ‘జాతర’ సినిమాకు యూఎస్, యూకేలో ఫిలింస్ కు వర్క్ చేసే మూవీ టెక్ అనే కంపెనీ ప్రొడక్షన్ లో జాయిన్ అయి ఎంతో సపోర్ట్ చేసింది. మూవీ టెక్ నుంచి అలెక్స్ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ టైమ్ లో టెక్నికల్ గా చూసుకున్నారు.
  • నాకు నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగాలని ఉంది. నాకు ఇండస్ట్రీ అంటే ప్యాషన్. అలాగే దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. వారి స్ఫూర్తితోనే ‘జాతర’ సినిమా చేశాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతాను. త్వరలో మరికొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను.

Latest News

Hakku initiative Mana Hakku Hyderabad curtain raiser song launched

Hakku Initiative, a social awareness campaign in partnership with the public and the government, launched the 'Hyderabad Curtain Raiser'...

More News