ఫిబ్రవరి 28న రాబోతోన్న ‘గార్డ్’ చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయాలి.. విరాజ్ రెడ్డి చీలం

విరాజ్ రెడ్డి చీలం హీరోగా జగ పెద్ది దర్శకత్వంలో అను ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనసూయ రెడ్డి నిర్మించిన చిత్రం ‘గార్డ్’. రివేంజ్ ఫర్ లవ్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయబోతోన్నారు. సినిమా మొత్తాన్ని ఆస్ట్రేలియాలో షూట్ చేయడం విశేషం. హారర్, థ్రిలర్, లవ్ ఎలిమెంట్స్‌తో రాబోతోన్న ఈ చిత్రంలో మిమీ లియానార్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..

విరాజ్ రెడ్డి చీలం మాట్లాడుతూ.. ‘గార్డ్ మూవీ కోసం ఇలా మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చాను. గార్డ్ కోసం చాలా కష్టపడ్డాం. మీడియా సపోర్ట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఏదైనా సాధించగలం. మా టీంను మీడియా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. మా టీజర్ నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. మా డైరెక్టర్, టీం ఆస్ట్రేలియాలో ఉంది. రాజేష్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. అవుట్ పుట్ బాగా ఇచ్చాడు. సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ చేసిన బీనా గారు లేడీ బాస్ టైపులో ఉంటారు. పార్థు పోస్టర్లను చక్కడా డిజైన్ చేశారు.సందీప గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రణయ్ మా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి లవ్ సాంగ్స్ ఇచ్చారు. సిద్దార్థ్ బీజీఎం గురించి అందరూ మాట్లాడుకుంటారు. జగ పెద్ది మా సినిమాకు దర్శకుడు. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో ఏ ఒక్కరూ కొత్త యాక్టర్ అన్న ఫీలింగ్ రాదు. మిమి లియోనార్డ్, శిల్పా ఇలా అందరూ అద్భుతంగా నటించారు. అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగాను. చిన్న చిత్రాలను అందరూ సపోర్ట్ చేయండి’ అని కోరారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ.. ‘గార్డ్ పాటలు అద్భుతంగా ఉంటాయి. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్స్, ఆర్ఆర్ అందరినీ మెప్పిస్తుంది. ఆడియో, సౌండ్ మిక్సింగ్ కూడా మా స్టూడియోలోనే జరిగింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అనసూయ మేడంకు థాంక్స్. విరాజ్‌లో నటన పట్ల చాలా ప్యాషన్ ఉంది. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నేపథ్య సంగీత దర్శకుడు సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘గార్డ్ చిత్రానికి నేను ఆర్ఆర్ ఇచ్చాను. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. విరాజ్‌కు అన్ని క్రాఫ్ట్‌ల మీద నాలెడ్జ్ ఉంది. జగా ఈ మూవీని ఎంతో చక్కగా తీశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. సినిమా అంతా కూడా ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రణయ్ పాటలు బాగుంటాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 28న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

నటీనటులు – విరాజ్‌రెడ్డి చీలం, మిమీ లియోనార్డ్, శిల్పా బాలకృష్ణ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : అను ప్రొడక్షన్స్
నిర్మాత: అనసూయ రెడ్డి
దర్శకుడు: జగ పెద్ది
నేపథ్య సంగీత దర్శకుడు: సిద్ధార్థ్ సదాశివుని
సంగీత దర్శకుడు : ప్రణయ్ కాలేరు
సినిమాటోగ్రాఫర్ : మార్క్ కెన్ఫీల్డ్
మిక్సింగ్ & మాస్టర్: విస్టార్ & వాల్యూమ్ స్టూడియోస్
స్టంట్ డైరెక్టర్ : పువెన్ పాంథర్
ఎడిటర్ : రాజ్ మేడ
పీఆర్వో : వంశీ కాకా

Tfja Team

Recent Posts

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

11 hours ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

11 hours ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

12 hours ago

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…

15 hours ago

‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ఈవెంట్‌లో హీరో దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…

18 hours ago

‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…

19 hours ago