ప్ర‌భాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మా ఆనందం’ ట్రైల‌ర్ విడుద‌ల‌.

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ‘బ్రహ్మా ఆనందం’ ఓ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన ఓ యువ‌కుడు థియేట‌ర్ ఆర్టిస్ట్ కావాల‌నుకుంటాడు. దీని కోసం అత‌నికి కొంత డ‌బ్బు అవ‌సరం అవుతుంది. ఆ క్ర‌మంలో అత‌నికి ఓ ముస‌లి వ్య‌క్తి ప‌రిచ‌య‌మై, త‌న 6 ఏక‌రాల పొలం ఇచ్చేస్తానంటాడు. అయితే 10 రోజుల పాటు త‌న స్వార్థం కోసమే ఆలోచించ‌కుండా ప‌క్క‌నున్న వారి కోసం కూడా ఆలోచించాల‌నే కండీష‌న్ పెడ‌తాడు స‌ద‌రు ముస‌లి వ్య‌క్తి.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే ‘బ్రహ్మా ఆనందం’ సినిమా.
ఓ వైపు డ‌బ్బులు అవ‌సర‌ముండి.. ముస‌లి వ్య‌క్తి చెప్పిన ప‌నులు చేసే కుర్రాడి పాత్ర‌లో రాజా గౌత‌మ్‌, .. అత‌న్ని ఇబ్బంది పెట్టే తాత పాత్ర‌లో బ్ర‌హ్మానందం ఒదిగిపోయారు. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌తో పాటు ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్ జ‌త చేసి.. చుట్టూ ఉన్న పాత్ర‌ల‌ను ఆక‌ట్టుకునేలా ద‌ర్శ‌కుడు ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకునే ఫ‌న్నీ రోల్‌లో మెప్పించ‌నుంటే, సంప‌త్ క్యారెక్ట‌రైజేష‌న్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక హీరో లైఫ్‌లో ల‌వ్ ట్రాక్ ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లారు మేక‌ర్స్‌.

బ్రహ్మా ఆనందం చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు, క వంటి చిత్రాల తరువాత నంది వంశీ నందిపాటి ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు హక్కుల్ని చేజిక్కించుకున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. శాండిల్య పిసాపాటి సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని కెమెరా మెన్‌గా, ప్రణీత్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు : రాజా గౌతమ్, పద్మశ్రీ అవార్డ్ గ్ర‌హీత‌ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్
సినిమాటోగ్ర‌ఫీ: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

5 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

5 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

6 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

6 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

6 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago