‘వార్ 2’లో హృతిక్ పాత్రను ఆడియెన్స్‌కి మరింత దగ్గర చేసేలా స్టైలింగ్ చేశాము : కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

గ్రీకు గాడ్ ఆఫ్ ఇండియా అని అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. భారతదేశంలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ తన యాక్షన్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌కు పెట్టింది పేరు. వరుస విజయాలను అందించే YRF స్పై యూనివర్స్‌లోని బ్లాక్‌బస్టర్ వార్ ఫ్రాంచైజీలో హృతిక్ సూపర్ గూఢచారి అయిన కబీర్ పాత్రను హృతిక్ అద్భుతంగా పోషించిన సంగతి తెలిసిందే.

‘వార్’ చిత్రంలో కబీర్ పాత్రలో హృతిక్ కనిపించిన తీరు, ఆయన స్టైలింగ్, లుక్స్, క్యాస్టూమ్స్‌కు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ‘వార్ 2’లోనూ హృతిక్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సారి మాత్రం మరింత స్టైలీష్‌గా కనిపించబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ టీజర్‌లో కబీర్ కారెక్టర్‌లో మరోసారి హృతిక్ మరింత స్టైలీష్‌గా కనిపించారు.

ఇక హృతిక్ క్యాస్టూమ్స్, స్టైలింగ్ గురించి వచ్చిన ప్రశంసలతో కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఉబ్బితబ్బిబైపోయారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం హృతిక్ పాత్రను, ఆయన స్టైలింగ్‌ను మరింత స్పెషల్‌గా డిజైన్ చేశాం. ధూమ్ 2, బ్యాంగ్ బ్యాంగ్, వాణిజ్య ప్రకటనల్లో హృతిక్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. చాలా కాలం తరువాత మళ్లీ ‘వార్’ సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చింది. ప్రతీ సారి మేం ఇద్దరం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసేవాళ్లం. కానీ ‘వార్’తో మేం పూర్తిగా రూట్ చేంజ్ చేశాం. మమూలు దుస్తులు వేసినా కూడా దాంట్లో ఓ ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. పైగా కబీర్ పాత్రలోని ఒంటరితనం, ఆ పాత్రలోని దేశ భక్తి ఇలా అన్నీ వ్యక్తం అవ్వాలనే ఉద్దేశంతో క్యాస్టూమ్స్, స్టైలింగ్‌ను డిజైన్ చేశాను. సాదారణ దుస్తుల్లోనూ ఓ సూపర్ హీరోలా కనిపించాలని నేను అనుకున్నాను.

ఈ సారి వార్ కంటే భిన్నంగా, మరింత అద్భుతంగా ఉండాలని కబీర్ పాత్ర కోసం శ్రమించాము. హెయిర్‌కట్ దగ్గర్నుంచి ప్రతీ విషయంపై ఎంతో శ్రద్ద పెట్టాము. హృతిక్‌లో ఉండే ఆ అట్రాక్టివ్ పవర్‌ను మరింతగా మెరుగుపర్చేలా స్టైలింగ్ చేశాను’ అని అన్నారు.

ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ ‘వార్ 2’లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ మధ్య ఢీ అంటే ఢీ అనే పోటీ ఉండనుంది. కియారా అద్వానీ మరో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

19 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

19 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

19 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

19 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

19 hours ago