‘హే బల్‌వంత్’తో కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నాం.. రిలీజ్ ప్రెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత వంశీ నందిపాటి

‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇప్పటి వరకు మా ‘హే బల్‌వంత్’ మూవీ గురించి చాలా సార్లు చాలా వేదికలపై చెప్పాం. 650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. ఇది మా కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. రేపు రిలీజ్ అవుతుండగా.. గురువారం సాయంత్రం నుంచే చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్లను స్టార్ట్ చేశాం. అన్ని ఏరియాల్లో ఈ పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశాం. వన్ మంత్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా.. వన్ మంత్ జిమ్, రన్నింగ్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క మూడు గంటలు మాకిస్తే.. వన్ మంత‌కి సరిపడే ఆరోగ్యాన్ని మేం మీకు ఇస్తాం.. మా దగ్గర మంచి స్టోరీ, మంచి ఎమోషన్ ఉంది. మా దగ్గర మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. అందరూ వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లండి. మేం కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నామ’ని అన్నారు.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ .. ‘‘హే భగవాన్’ మరింత బలవంతంగా మారి ‘హే బల్‌వంత్’గా రాబోతోంది. ఓవర్సీస్‌లో మూడు వందల థియేటర్లకు పైగా రిలీజ్ అవుతోంది. అక్కడ అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. అక్కడా, ఇక్కడా మంచి జోష్‌లో దూసుకుపోతోంది. అనిల్ సుంకర గారు ఓవర్సీస్‌లో వైబ్ చూసి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని అన్నారు. మరో డైరెక్టర్ ఫోన్ చేసి రెండున్నర గంటలసేపు నవ్వించేశారు అని చెప్పారు. మీడియా కూడా ముందే మాకు కంగ్రాట్స్ చెబుతోంది. ఈ ఏడాది అంతా టాలీవుడ్‌కు కలిసి వచ్చేలా ఉంది. కొత్తదనంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రాబోతోంది. సుహాస్ నెక్ట్స్ ఫేజ్‌లోకి వెళ్తున్నాడు.క్లైమాక్స్‌లో సుహాస్ అందరినీ ఆకట్టుకుంటాడు. తెలుగు సినిమాల్లో ‘హే బల్‌వంత్’ మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది. ఈ మూవలో అందరూ అద్భుతంగా నటించారు. గోపీ రూపంలో తెలుగు ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు. వంశీ నందిపాటి ఉంటే చాలు ఆ సినిమా హిట్టే. ఫిబ్రవరి 19 సాయంత్రం నుంచే ప్రీమియర్లు స్టార్ట్ కాబోతోన్నాయి. మేం అందరూ ప్రస్తుతం ఎంతో విజయోత్సాహాంలో ఉన్నామ’ని అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ .. ‘‘హే బల్‌వంత్’ ప్రీమియర్లు ఫిబ్రవరి 19న స్టార్ట్ అయ్యాయి. ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ రిలీజ్, బిగ్గెస్ట్ సక్సెస్ అని అనుకోవచ్చు. మా మూవీని ఈ రేంజ్‌కు తీసుకు వచ్చిన వంశీ గారికి థాంక్స్. నేను ఓ కామన్ మెన్‌గా ఇక్కడి వరకు వచ్చాను. మనం పెట్టే ప్రతీ రూపాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ మూవీని చేశాను. నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. సుహాస్ గ్యారెంటీ.. ‘హే బల్‌వంత్’ అనేది సుహాస్ 2.ఓ. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

TFJA

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

49 minutes ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago