టాలీవుడ్

ఆడియన్స్‌కూ థ్రిల్ ఇస్తుంది ‘యశోద’ చూసాక

‘యశోద’లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు.  తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. సమంతతో ఇంటర్వ్యూ… 

హాయ్ సమంత గారు… ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

థాంక్యూ… ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈ రోజు ‘యశోద’ విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. 

మీ ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?

అవును… నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు. 

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది?

సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం. 

కమింగ్ టు యశోద… టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? 

చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

‘యశోద’ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా?

సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ‘యశోద’ ఒకటి. ‘యశోద’ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 

పురాణాల్లో ‘యశోద’ గురించి విన్నాం. మోడ్రన్ ‘యశోద’ ఎలా ఉంటుంది?  

ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన ‘యశోద’ గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత ‘యశోద’ క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది. 

ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం?

సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. 

సినిమాలో సరోగసీ మాత్రమే కాదని, ఇంకా పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. కథ గురించి ఇంకొంచెం చెబుతారా?

కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే… సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. ‘యశోద’ ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి. 

మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి?

కథలు వినేటప్పుడు గానీ… తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ… ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. ‘యశోద’ కంటే ముందు ‘యు – టర్న్’ చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, ‘యశోద’ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే… యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. 

యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్షన్ చేయడం ఎలా అనిపించింది? ఇంతకు ముందు మీరు యాక్షన్ చేసినా… ఈ రేంజ్ హార్డ్ కోర్ ఫైట్స్ చేయలేదనుకుంట కదా! 

యానిక్ బెన్ తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ‘యశోద’లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్… ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను. 

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్… సినిమాలో భారీ తారాగణం ఉంది. సెట్స్ లో అందరూ కలిసినప్పుడు ఎలా ఉండేది. ఇందులో కొంత మందితో మీరు ముందు కూడా నటించారు కదా!

సినిమాలో నటీనటులు అందరితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ‘యశోద’లో వివిధ భాషల నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. 

ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుబంధం…

సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.  

పాన్ ఇండియా రిలీజ్ ఆలోచనతో కథ మీ దగ్గరకు వచ్చిందా? లేదంటే… 

కథ చూస్తే… కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా ‘పాన్ ఇండియా’ అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.  

తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? తెలుసుకుంటున్నారా?

నిజం చెప్పాలంటే… అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే… మైక్రో ట్రెండ్స్. ఒక్కో భాషలో ప్రేక్షకులకు ఒక్కో అంశం నచ్చుతుంది. వాళ్ళ అభిరుచులు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకని, ఎవరికి ఏం నచ్చిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి, సూర్య, వరుణ్ ధావన్… ట్రైలర్ విడుదల చేసిన హీరోలు అందరికీ థాంక్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువ అయ్యింది. 

సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉన్నప్పటికీ… మీరే డబ్బింగ్ చెప్పడానికి కారణం? 

‘యశోద’కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది. 

‘యశోద’లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది రోల్?

వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది. 

ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు?

వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం. 

Tfja Team

Recent Posts

కిచ్చా సుదీప్ యాక్షన్ ప్యాక్డ్ ‘మ్యాక్స్’ ట్రైలర్ విడుదల

/ మ్యాక్స్‌తో మాట్లాడేటప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ మైంటైన్ చేయాలి… పవర్ ఫుల్ యాక్షన్ & పంచ్ డైలాగులతో 'కిచ్చా' సుదీప్ 'మ్యాక్స్' ట్రైలర్…

58 minutes ago

ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘శంబాల’ ఫస్ట్ లుక్ విడుదల

వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ కథా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త…

1 hour ago

మెస్మరైజ్ చేస్తున్న మరోమలయాళ చిత్రం “మార్కో”

"బాహుబలి, కె.జి.ఎఫ్" చిత్రాలసరసన సగర్వంగా నిలిచేలాకలెక్షన్ల దుమ్ము రేపుతున్న "మార్కో" హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైమ్యాజిక్ చేస్తున్న మలయాళ చిత్రం!!…

1 hour ago

Another Mesmerizing Malayalam Film – “Marco”

"Marco," a Malayalam movie, is creating a storm at the box office, standing tall alongside…

1 hour ago

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్…

23 hours ago

Grand Launch the Movie Marrichettu Kinda Manollu

Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…

23 hours ago