‘వృషభ’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల..

మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా ‘వృషభ’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల.. అక్టోబర్ 16న చిత్రం గ్రాండ్ రిలీజ్

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. మాలీవుడ్‌లోనే కాకుండా ప్యాన్ ఇండియా వైడ్‌గా వస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘వృషభ’ చిత్రం ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ చిత్రం నుంచి మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘వృషభ’ నుంచి రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో మోహన్‌లాల్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. మోహన్‌లాల్ ఆహార్యం, కనిపించిన విధానం, ఆ కత్తి పట్టుకున్న తీరు, జుట్టు ఎగురుతున్న స్టైల్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో ఉత్తమ యోధుడిలా కనిపించబోతోన్నారనిపిస్తోంది. ‘నా అభిమానులకు బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను అంకితం చేస్తున్నాను.. ఇకపై వారి ఎదురుచూపులకు తెర దించినట్టే.. అందరినీ కట్టి పడేసేలా, అందరినీ ఆకట్టుకునేలా ‘వృషభ’ చిత్రం ఉంటుంది’ అని మోహన్‌లాల్ పోస్ట్ వేశారు.

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్ సమర్పణలో నంద కిషోర్ రచన, దర్శకత్వంలో ‘వృషభ’ రాబోతోంది. యాక్షన్, ఎమోషన్, పౌరాణిక గాథలను అద్భుతంగా మిళితం చేసి ఓ దృశ్య కావ్యంలా సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీనీ అక్టోబర్ 16, 2025న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ అనే ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతాతో వంటి వారు ఈ ‘వృషభ’ చిత్రీకరణలో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అందరి సమిష్టి కృషితో ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు.

ఉత్కంఠభరితమైన విజువల్స్, భావోద్వేగంతో కూడిన సన్నివేశాల నుంచి భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలతో ‘వృషభ’ ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపనుంది. ఈ సినిమాను అక్టోబర్ 16, 2025న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago